రొట్టెల పండుగలో ప్రత్యేకత చూపిన ప్రభుత్వం

నెల్లూరు రొట్టెల పండుగ వస్తే రాజకీయ పార్టీల ప్రచారానికి అదో వేదికగా ఉండేది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు…. కాబట్టి నేతలు పోటీ పడి ఫ్లెక్సీలు పెట్టుకునే వారు. తమ బలప్రదర్శన చేసేవారు. గల్లీ లీడర్ల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఫ్లెక్సీలు నిండిపోయేవి. ఎన్నో ఏళ్లుగా ఈ తంతు సాగుతూనే వచ్చింది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి. రొట్టెల పండుగ సందర్భంగా రాజకీయ ఫ్లెక్సీలను నిషేధించారు. ఇందుకు అధికార […]

Advertisement
Update:2019-09-13 05:30 IST

నెల్లూరు రొట్టెల పండుగ వస్తే రాజకీయ పార్టీల ప్రచారానికి అదో వేదికగా ఉండేది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు…. కాబట్టి నేతలు పోటీ పడి ఫ్లెక్సీలు పెట్టుకునే వారు. తమ బలప్రదర్శన చేసేవారు. గల్లీ లీడర్ల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఫ్లెక్సీలు నిండిపోయేవి.

ఎన్నో ఏళ్లుగా ఈ తంతు సాగుతూనే వచ్చింది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి. రొట్టెల పండుగ సందర్భంగా రాజకీయ ఫ్లెక్సీలను నిషేధించారు.

ఇందుకు అధికార పార్టీకి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలే చొరవ చూపారు. రొట్టెల పండుగ రాజకీయ ప్రచార వేదిక కాకూడదని… పూర్తి ఆధ్యాత్మికతతోనే కార్యక్రమం సాగాలని వారు ఆదేశించారు.

తొలి రోజు కొందరు అభిమానులు తన ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి అప్పటికప్పుడు వాటిని చించివేయించారు. ఏ ఒక్కరూ కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టవద్దని ఆదేశించారు. దాంతో ఈసారి భక్తులకు భారీ ఫ్లెక్సీల్లో నేతల ముఖాలను దర్శనం చేసుకోవాల్సిన బాధ తప్పింది.

గత ప్రభుత్వ హయాంలో రొట్టెల పండుగ రాగానే లక్షలు పోసి ప్రభుత్వం పత్రికలు, టీవీల్లో ప్రచారం చేసుకునేది. కానీ ఈసారి ప్రచార ఆర్భటాన్ని ప్రభుత్వం దాదాపు తగ్గించేసింది.

గతంలో దర్గా వరకు వాహనాలను అనుమతి ఇచ్చేవారు. దాంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. ఈసారి దర్గా సమీపంలోనే వాహనాలను ఆపేస్తున్నారు. దాంతో దర్గా వద్ద భక్తులు తిరిగేందుకు సౌకర్యవంతంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News