బాబు, ఎల్లో మీడియా పై విజయసాయిరెడ్డి ఫైర్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడి 100 రోజులే అయినా అప్పుడే అతి చేయడం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. నిద్రపట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశంవైపు రాళ్లు విసిరినట్టుగా చంద్రబాబు ప్రవర్తన ఉందని, ఆయన వేసే ఎంగిలి మెతుకులు తినే బానిస, ఎల్లో మీడియా వ్యవహారం కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు, పల్నాడులో వేధింపుల పేరుతో శిబిరాలు, […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడి 100 రోజులే అయినా అప్పుడే అతి చేయడం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. నిద్రపట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశంవైపు రాళ్లు విసిరినట్టుగా చంద్రబాబు ప్రవర్తన ఉందని, ఆయన వేసే ఎంగిలి మెతుకులు తినే బానిస, ఎల్లో మీడియా వ్యవహారం కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.
జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు, పల్నాడులో వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యంపై ఏడుపులు, వాలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు పెడుతున్న చంద్రబాబు ఇంకా ఐదేళ్లు ఎలా తట్టుకుంటారో అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు ఆనవాయితీగా ప్రారంభించే డ్రామాలు ఇప్పుడే ప్రారంభించాడని ఎద్దేవా చేశారు.
యరపతినేని, కోడెల, దూడలను రక్షించేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని.. పల్నాడు ప్రాంతంలో కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు కుట్రలు మొదలుపెట్టారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పేదల జోలికి వస్తే ఊరుకోబోనని చంద్రబాబు అంటున్నారని… చంద్రబాబు దృష్టిలో పేదలంటే కోడెల, యరపతినేని, చింతమనేని, నారాయణ, ఏబీఎన్ రాధాకృష్ణ, సుజనాచౌదరే అని ఎద్దేవా చేశారు.
ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు @ncbn గారూ?. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2019
నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరాడట. @ncbn, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం అలాగే ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చిత్తు చిత్తుగా ఓడి 100 రోజులే అయింది బాబు గారూ. @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2019
యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా @ncbn దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలింది. ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోంది. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2019