ప్రభాస్ స్పందించాడు.. కేటీఆర్ థ్యాంక్స్ చెప్పాడు...

రాజకీయాలంటే ఆమడ దూరంగా ఉండే హీరోల్లో హీరో ప్రభాస్ ఒకరు. ఇటీవలే సాహోతో మనముందుకు వచ్చిన ప్రభాస్ ఎప్పుడూ రాజకీయాల గురించి స్పందించింది లేదు. రాజకీయాలపై ఆచితూచి తనకు తెలియదన్నట్టు ఉండేవారు. కానీ తాజాగా రాజకీయాలపై వరుసగా రెండు సార్లు స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే సాహో ప్రమోషన్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పాలన తీరు బాగుందని ప్రభాస్ చేసిన కామెంట్ అందరనీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మరోసారి హైదరాబాద్ లో విషజ్వరాలపై యుద్ధం ప్రకటించిన కేటీఆర్ […]

Advertisement
Update:2019-09-11 08:00 IST

రాజకీయాలంటే ఆమడ దూరంగా ఉండే హీరోల్లో హీరో ప్రభాస్ ఒకరు. ఇటీవలే సాహోతో మనముందుకు వచ్చిన ప్రభాస్ ఎప్పుడూ రాజకీయాల గురించి స్పందించింది లేదు. రాజకీయాలపై ఆచితూచి తనకు తెలియదన్నట్టు ఉండేవారు.

కానీ తాజాగా రాజకీయాలపై వరుసగా రెండు సార్లు స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే సాహో ప్రమోషన్ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పాలన తీరు బాగుందని ప్రభాస్ చేసిన కామెంట్ అందరనీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా మరోసారి హైదరాబాద్ లో విషజ్వరాలపై యుద్ధం ప్రకటించిన కేటీఆర్ స్వయంగా తన ఇంటి పరిసరాలు క్లీన్ చేసి అందరూ చేయాలని ఇచ్చిన పిలుపుపై ప్రభాస్ స్పందించాడు.

కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేసి అందరూ స్టే సేఫ్ అంటూ.. ఉద్యమంలో పాలుపంచుకోవాలని సూచించారు.

ఇలా తొలిసారి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి కేటీఆర్ చేసిన పనిని ప్రశంసించిన ప్రభాస్ కు కేటీఆర్ స్వయంగా థ్యాంక్స్ చెప్పారు. కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే మహేష్ సహా ఏ హీరో స్పందించకముందే ప్రభాస్ స్పందించడం విశేషం.

ఇటీవలే సాహో చూసిన కేటీఆర్.. డార్లింగ్ ప్రభాస్ సినిమా బాగుందని కితాబిచ్చాడు. ఇప్పుడు కేటీఆర్ చేసిన పనిని ప్రభాస్ కొనియాడారు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు నెలల వ్యవధిలోనే పొగిడేసుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

Prevent viral fevers and dengue by keeping your home and surroundings clean and hygienic. Please share and spread the word. Stay Safe!

Posted by Prabhas on Tuesday, 10 September 2019

Tags:    
Advertisement

Similar News