'చాణక్య' టీజర్ టాక్....

ఈ మధ్యనే తన కెరీర్ లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పంతం’ సినిమా తో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన ‘చాణక్య’ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ‘పంతం’ సినిమా లో రొమాన్స్ చేసిన మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఈ సినిమాలో ఒక […]

Advertisement
Update:2019-09-10 06:10 IST

ఈ మధ్యనే తన కెరీర్ లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పంతం’ సినిమా తో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన ‘చాణక్య’ పైనే ఆశలు పెట్టుకున్నాడు.

‘పంతం’ సినిమా లో రొమాన్స్ చేసిన మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ వీడియో చూస్తుంటే సినిమా ఒక థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రొమాంటిక్-యాక్షన్ సినిమాలలో నటించిన గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో కూడా మళ్లీ అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Tags:    
Advertisement

Similar News