ఆదివాసీ యువతి పైలట్ కల నిజమయింది

మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి నిరూపించింది ఈ 27 ఏళ్ల ఆదివాసి అమ్మాయి. ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత జిల్లా మల్కాన్ గిరి. ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ జిల్లా కి చెందిన అనుప్రియ లక్రా అనే ఆదివాసి యువతి పైలట్ కావాలని కన్న తన కలలను నిజం చేసుకుంటూ ఏడేండ్లు కష్టపడి పైలెట్ అయింది. ఈ ప్రాంతం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి ఆదివాసి యువతి […]

Advertisement
Update:2019-09-10 00:32 IST

మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని మరోసారి నిరూపించింది ఈ 27 ఏళ్ల ఆదివాసి అమ్మాయి.

ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత జిల్లా మల్కాన్ గిరి. ఇది చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ జిల్లా కి చెందిన అనుప్రియ లక్రా అనే ఆదివాసి యువతి పైలట్ కావాలని కన్న తన కలలను నిజం చేసుకుంటూ ఏడేండ్లు కష్టపడి పైలెట్ అయింది. ఈ ప్రాంతం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి ఆదివాసి యువతి గా ఆమె రికార్డు సృష్టించింది.

ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ ఆమె తండ్రి. తల్లి సాధారణ గృహిణి. అయినప్పటికీ తమ బిడ్డ… చదివే ఇంజనీరింగ్ కోర్సును మధ్యలోనే ఆపేసి ఏవియేషన్ అకాడమీ లో శిక్షణకై ఎంట్రన్స్ టెస్ట్ కి ప్రిపేర్ అవుతానంటే అడ్డు పడలేదు వారు. వారి ప్రోత్సాహంతోనే 2012లో ఆమె ఏవియేషన్ అకాడమీ లో జాయిన్ అయింది. ఇప్పుడు తన శిక్షణను పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో పైలెట్ గా ఉద్యోగాన్ని సంపాదించింది.

ఈ సంగతి తెలుసుకున్న ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ “అనుప్రియ లక్రా విజయానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంకితభావంతో ఆమె సాధించిన ఈ ఘనత ఎందరికో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది” అని అభినందనలు తెలిపారు. దీంతో ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News