చిట్టగాంగ్ టెస్టులో అప్ఘనిస్థాన్ హవా

బంగ్లాగడ్డపై రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో స్వదేశీపిచ్ పైన బంగ్లాదేశ్ విలవిల టెస్ట్ క్రికెట్లో పసికూన అప్ఘనిస్థాన్.. మూడుటెస్టుల్లో రెండో విజయానికి సిద్ధమయ్యింది. చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఐదురోజుల టెస్ట్ మొదటి మూడురోజుల ఆటలోనూ అప్ఘన్ జోరే కొనసాగింది. టెస్ట్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పిన రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షోతో బంగ్లాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో… కెప్టెన్ గా తన తొలిటెస్ట్ […]

Advertisement
Update:2019-09-07 15:40 IST
  • బంగ్లాగడ్డపై రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో
  • స్వదేశీపిచ్ పైన బంగ్లాదేశ్ విలవిల

టెస్ట్ క్రికెట్లో పసికూన అప్ఘనిస్థాన్.. మూడుటెస్టుల్లో రెండో విజయానికి సిద్ధమయ్యింది. చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఐదురోజుల టెస్ట్ మొదటి మూడురోజుల ఆటలోనూ అప్ఘన్ జోరే కొనసాగింది.

టెస్ట్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పిన రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షోతో బంగ్లాను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో…

కెప్టెన్ గా తన తొలిటెస్ట్ మ్యాచ్ లోనే రషీద్ చెలరేగిపోయాడు. అప్ఘన్ తొలిఇన్నింగ్స్ లో రషీద్ ఖాన్ కేవలం 61 బాల్స్ లోనే 2 బౌండ్రీలు, 3 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. తనజట్టుకు 342 పరుగుల స్కోరు అందించడంలో ప్రధానపాత్ర వహించాడు.

అప్ఘన్ స్కోరుకు సమాధానంగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్…రషీద్ ఖాన్ లెగ్ స్పిన్ జాదూలో గల్లంతయ్యింది. 205 పరుగులకే కుప్పకూలింది.

రషీద్ ఖాన్ 19.5 ఓవర్లలో 55 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.

కెప్టెన్ గా 50 పరుగులు, 5 వికెట్లు సాధించిన యువఆటగాడిగా రషీద్ ఖాన్ రికార్డుల్లో చేరాడు.

137 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన అఫ్ఘన్ జట్టు 8 వికెట్లకు 237 పరుగుల స్కోరుతో… ఓవరాల్ గా 374 పరుగుల ఆధిక్యత సంపాదించింది.

అఫ్ఘన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ అప్ఘన్ మొదటి ఇన్నింగ్స్ లో 92, రెండో ఇన్నింగ్స్ లో 50 పరుగుల స్కోరు సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

గత ఏడాదే భారత ప్రత్యర్థిగా తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడిన అఫ్ఘన్ జట్టు మొదటి రెండుటెస్టుల్లోనే ఓ గెలుపు, ఓటమి రికార్డుతో నిలిచింది.

Tags:    
Advertisement

Similar News