బాబును ఓడించింది వీళ్ళ బలుపేనా?

ముందు ఓటమిని అంగీకరిస్తే… ఆ తర్వాత గెలుపు కోసం ప్రయత్నాలు చేయవచ్చు. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికీ తమను ప్రజలు ఓడించలేదు… ఏదో అక్రమం జరిగింది…. టీడీపీ ఓడినందుకు ప్రజలు నిత్యం గంట పాటు కన్నీరు పెట్టుకుని దిగ్బ్రాంతి చెందుతున్నారు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ ఎన్నికల్లో దాదాపు నేలమట్టం అవడానికి ప్రధాన కారణాల్లో కులతత్వం ఒకటి అన్నది ఆ పార్టీ నేతలే అంగీకరించకతప్పని పరిస్థితి. బ్రీడులనందు తమ బ్రీడ్‌ వేరని బాలకృష్ణ చెప్పుకోవడం […]

Advertisement
Update:2019-09-06 05:58 IST

ముందు ఓటమిని అంగీకరిస్తే… ఆ తర్వాత గెలుపు కోసం ప్రయత్నాలు చేయవచ్చు. కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికీ తమను ప్రజలు ఓడించలేదు… ఏదో అక్రమం జరిగింది…. టీడీపీ ఓడినందుకు ప్రజలు నిత్యం గంట పాటు కన్నీరు పెట్టుకుని దిగ్బ్రాంతి చెందుతున్నారు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు.

టీడీపీ ఎన్నికల్లో దాదాపు నేలమట్టం అవడానికి ప్రధాన కారణాల్లో కులతత్వం ఒకటి అన్నది ఆ పార్టీ నేతలే అంగీకరించకతప్పని పరిస్థితి. బ్రీడులనందు తమ బ్రీడ్‌ వేరని బాలకృష్ణ చెప్పుకోవడం నుంచి… తమది సపరేటు రకతం దీన్ని ఎవరికీ ఎక్కించవద్దని బహిరంగ వేదికల మీద ప్రకటించుకునేంతగా కులరకతం ఉరకలేసింది బాబు హయాంలో. ఈ పరిస్థితికి బాధ్యులు చంద్రబాబు, ఆయన వెంట ఉన్న కొందరే తప్పించి ఆయా కులాల్లోని సామాన్యులు కాదు.

ఓడినా తమదే పైచేయి అన్న ధోరణి, అహంకారం మాత్రం టీడీపీలో చాలా మందికి ఇంకా దిగలేదు. బహుశా పిల్లి గుడ్డిదైతే ఎలుకదే రాజ్యం అన్నట్టుగా కొత్త ప్రభుత్వం మరీ ఉదాసీనంగా ఉండడం కూడా టీడీపీ వారికి కలిసొస్తోంది. పరిస్థితి ఎలా ఉందంటే… గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికీ టీడీపీ నేతలే అధికార పార్టీ నేతలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. గణేష్ మండపం వద్దకు వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో టీడీపీ వారు దూషించేంత సాహసం చేయగలుగుతున్నారు. ఇక గణేష్ ఉత్సవాల సందర్భంగా టీడీపీ వారు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు కూడా టాక్‌ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతున్నాయి.

గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో టీడీపీ శ్రేణులు తమ రాజసాన్ని ఫ్లెక్సీల్లో వివరించాయి. ” ప్రభుత్వం ఎవరిదైనా పరిపాలన మాదే. రాజ్యం ఎవరిదైనా రాజసం మాదే. అధికారం ఎవరిదైనా ఆధిపత్యం మాదే. శాసనం ఎవరిదైనా శాసించేది మేమే… చౌదరి!!” అంటూ రోడ్ల వెంబడి పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని చూసిన జనం వీరికి ఇంకా తగ్గినట్టు లేదే అని జోకులేస్తున్నారు.

ఇలా సమాజంలో అన్నింటికీ తాము అతీతులం అని టీడీపీ వారు చెప్పుకున్నంత కాలం ఇక బాబు మళ్లీ గెలవకపోవచ్చు అని కొందరు సైటైర్లు వేస్తున్నారు. వైసీపీ వాళ్లు మాత్రం ఈ ఫ్లెక్సీలు చూసి…. వారు చెప్పిన దాంట్లోనూ కొంచెం నిజముంది కదా అని నిట్టూర్పు విడుస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News