యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా
24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురి ఫైనల్లో బెలిండాతో సెరెనా అమీతుమీ అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ మరోసారి చేరుకొంది. తన కెరియర్ లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు మరింత చేరువయ్యింది. న్యూయార్క్ ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో 8వ సీడ్ సెరెనా 6-3, 6-1తో 5వ సీడ్ ఎలెనా స్వితోలినాను చిత్తు చేసింది. 37 ఏళ్ల వెటరన్ సెరెనా […]
- 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురి
- ఫైనల్లో బెలిండాతో సెరెనా అమీతుమీ
అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ మరోసారి చేరుకొంది. తన కెరియర్ లో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు మరింత చేరువయ్యింది.
న్యూయార్క్ ఆర్ధర్ యాష్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో 8వ సీడ్ సెరెనా 6-3, 6-1తో 5వ సీడ్ ఎలెనా స్వితోలినాను చిత్తు చేసింది.
కేవలం గంటా 10 నిముషాలలో ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొన్న సెరెనా..గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్స్ చేరడం ఇది 33వసారి.
మహిళా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీల చరిత్రలో అత్యధికంగా 24 టైటిల్స్ నెగ్గిన మార్గారెట్ కోర్టు రికార్డును..సమం చేయటానికి సెరెనా తహతహలాడుతోంది.
శనివారం జరిగే టైటిల్ సమరంలో సెరెనా విజేతగా నిలిస్తే తల్లి హోదాలో తొలి టైటిల్ నెగ్గినట్లవుతుంది.
స్విస్ సంచలనం బెలిండాతో టైటిల్ సమరంలో సెరెనా తలపడనుంది.