శ్రీకాకుళం అమ్మాయికి అరుదైన అవకాశం

చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశకు చేరుకున్న వేళ… ప్రధానమంత్రి తో కలిసి ఆ దృశ్యాలను చూసే అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ తండ్రిలేని పేద విద్యార్ధిని గెలుచుకుంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఓ ఆణిముత్యం వెలుగు చూసింది. ఇస్రో చంద్రుని పైకి పంపిన చంద్రయాన్ 2 రోవర్ చంద్రునిపై ఈ నెల 7 వ తేదీన (6 వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత) దిగనున్నది. ప్రధానమంత్రి మోడీ బెంగళూరు లో ఆ దృశ్యాన్ని […]

Advertisement
Update:2019-09-05 11:28 IST

చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశకు చేరుకున్న వేళ… ప్రధానమంత్రి తో కలిసి ఆ దృశ్యాలను చూసే అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ తండ్రిలేని పేద విద్యార్ధిని గెలుచుకుంది.

వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఓ ఆణిముత్యం వెలుగు చూసింది. ఇస్రో చంద్రుని పైకి పంపిన చంద్రయాన్ 2 రోవర్ చంద్రునిపై ఈ నెల 7 వ తేదీన (6 వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత) దిగనున్నది. ప్రధానమంత్రి మోడీ బెంగళూరు లో ఆ దృశ్యాన్ని చూడనున్నారు. చంద్రయాన్ పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి ఇస్రో ఓ వినూతన అవకాశం కల్పించింది. 8-10 తరగతులు చదివే పిల్లలకు ప్రధానమంత్రి తో పాటు అరుదైన సాఫ్ట్ లాండింగ్ సంఘటన దృశ్యాన్ని చూసే అవకాశం ఇవ్వాలనుకున్నది.

అలా చూడాలనుకునే విద్యార్థులకు ఒక ఆన్ లైన్ క్విజ్ ఆగస్ట్ 10 నుంచి 25 వరకు నిర్వహించింది. దేశం నలు మూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ క్విజ్ లో పాల్గొన్నారు.

అలా పాల్గొన్న పిల్లల్లో మన శ్రీకాకుళం జిల్లా లోని తలసముద్రం గ్రామానికి చెందిన ప్రగడ కాంచన బాలశ్రీ వాసవి ఒకటి. ఈ అమ్మాయి ఈదులవలస అంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్నది. చిన్నవయసులోనే తండ్రి చనిపోవడం తో తల్లే కష్టపడి తన చెల్లిని, తనను చదివిస్తోందని ఈ చదువుల తల్లి అంటోంది.

తనతోపాటు తన తల్లిని కూడా బెంగళూరు ఇస్రో సెంటర్ కి తీసుకుపోతున్న వాసవి… అరుదైన దృశ్యాన్ని దేశ ప్రధానమంత్రి తో కలిసి చూసేందుకు తహ తహ లాడుతున్నది. దేశం మొత్తం మీద 60 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం లభించిందంటే క్విజ్ పోటీ ఎంత గట్టిగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News