యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో ఫెదరర్ కు షాక్
దిమిత్రోవ్ చేతిలో ఫెదరర్ ఐదుసెట్ల పరాజయం యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఆరోసారి నెగ్గాలన్న గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఆశలు క్వార్టర్ ఫైనల్స్ లోనే అడియాసలయ్యాయి. 3వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన 38 ఏళ్ల ఫెదరర్ కు బల్గేరియా ఆటగాడు గ్రిగోల్ దిమిత్రోవ్ 5 సెట్ల పోరులో షాకిచ్చి సెమీస్ కు అర్హత సాధించాడు. న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ హోరాహోరీ పోరులో 78వ […]
- దిమిత్రోవ్ చేతిలో ఫెదరర్ ఐదుసెట్ల పరాజయం
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఆరోసారి నెగ్గాలన్న గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ ఆశలు క్వార్టర్ ఫైనల్స్ లోనే అడియాసలయ్యాయి. 3వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన 38 ఏళ్ల ఫెదరర్ కు బల్గేరియా ఆటగాడు గ్రిగోల్ దిమిత్రోవ్ 5 సెట్ల పోరులో షాకిచ్చి సెమీస్ కు అర్హత సాధించాడు.
న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్స్ హోరాహోరీ పోరులో 78వ ర్యాంకర్ దిమిత్రోవ్ చేతిలో ఫెదరర్ 6-3, 4-6, 6-3, 4-6, 2-6 తో పరాజయం చవిచూశాడు.
తన కెరియర్ లో 21 గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గడంతో పాటు 46వ గ్రాండ్ స్లామ్ సెమీస్ బెర్త్ సాధించాలన్నఆశ ఆవిరైపోయింది.
సెమీఫైనల్లో డేనిల్లీ మెద్వదేవ్ తో దిమిత్రోవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో స్విస్ ఆటగాడు స్టాన్ వావరింకాపై మెద్వదేవ్ ఐదుసెట్ల విజయం సాధించాడు.
మహిళల సెమీస్ లో బెలిండా పురుషుల సింగిల్స్ లో స్విస్ ఆటగాళ్లు ఫెదరర్, వావరింకా పరాజయాలు పొందగా ..మహిళల సింగిల్స్ సెమీస్ కు స్విస్ సంచలనం బెలిండా బెన్ సిచ్ తొలిసారిగా చేరి సంచలనం సృష్టించింది.
క్వార్టర్ ఫైనల్లో బెలిండా 7-6, 6-3తో డోనా వేకిచ్ ను అధిగమించి తన కెరియర్ లో తొలిసారిగా సెమీస్ కు అర్హత సాధించింది.