మమత, కింజరపు గుర్తు చేసుకున్నారు.... మరి బాబు...

సర్వవ్యవస్థల్లో పాతుకుపోయి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తమ ప్రయోజనాలకు దెబ్బతగలకుండా దశాబ్దాలుగా కాలం నెట్టుకొస్తోంది టీడీపీ. అలాంటీ టీడీపీకి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం మాత్రం చాలా కష్టంగానే సాగింది. అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లా ఆయన టీడీపీ మీడియాకు మోకరిల్లలేదు. అన్ని వ్యవస్థల్లో మనుషులను చొప్పించుకున్న బాబు బలగాన్ని చూసి వైఎస్ వెనక్కు తగ్గలేదు. ఆ ప్రభావం వల్లే ఇప్పటికీ వైఎస్ కుటుంబం అంటే చంద్రబాబుకు ఎనలేని కోపం. ఎంతగా అంటే […]

Advertisement
Update:2019-09-03 04:01 IST

సర్వవ్యవస్థల్లో పాతుకుపోయి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తమ ప్రయోజనాలకు దెబ్బతగలకుండా దశాబ్దాలుగా కాలం నెట్టుకొస్తోంది టీడీపీ.

అలాంటీ టీడీపీకి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం మాత్రం చాలా కష్టంగానే సాగింది. అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లా ఆయన టీడీపీ మీడియాకు మోకరిల్లలేదు. అన్ని వ్యవస్థల్లో మనుషులను చొప్పించుకున్న బాబు బలగాన్ని చూసి వైఎస్ వెనక్కు తగ్గలేదు.

ఆ ప్రభావం వల్లే ఇప్పటికీ వైఎస్ కుటుంబం అంటే చంద్రబాబుకు ఎనలేని కోపం. ఎంతగా అంటే కనీసం పైకి కూడా ఒక దివంగత ముఖ్యమంత్రి పట్ల గౌరవం ప్రదర్శించలేనంత కోపం చంద్రబాబుకు. వైఎస్‌ వర్ధంతి సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్టీ కూడా ఆయనకు నివాళులర్పించారు. ఇతర పార్టీ నేతలు వైఎస్‌ను గుర్తు చేసుకున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం వరుసకు కూడా ట్విట్టర్ ద్వారా నివాళులర్పించలేదు. హరికృష్ణను జయంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు మరిచిపోకుండా చెప్పారు చంద్రబాబు.

పవన్‌ కల్యాణ్ విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తున్నారని… శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వైఎస్ కు మాత్రం నివాళులర్పించలేదు చంద్రబాబు.

అయితే టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు మాత్రం వైఎస్‌కు నివాళులర్పించడంలో స్వతంత్రత చూపారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా మొత్తం దక్షణ భారతీయులకు స్పూర్తి నింపిన నేత అని కొనియాడారు. వైఎస్ తీసుకొచ్చిన విధానాలు కోట్లాది ప్రజలను ప్రభావితం చేశాయని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఒక ఐకాన్‌గా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని కింజరపు కొనియాడారు.

వైఎస్‌కు నివాళులర్పించేందుకు కూడా మనసొప్పనంత బాధతో చంద్రబాబు ఉన్నప్పటికీ… ఆ పార్టీ ఎంపీ కింజరపు మాత్రం ఇలా వైఎస్‌ఆర్‌ గొప్ప వారు అని కొనియాడడం బట్టి … బాబు కోసం సొంత భావాలను రామ్మోహన్‌ నాయుడు అణచుకునేందుకు సిద్ధంగా లేరనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News