న్యాయవ్యవస్థ అవినీతి, కులతత్వంలో కూరుకుపోయింది " పట్నా హైకోర్టు న్యాయమూర్తి
న్యాయవ్యవస్థపై పట్నా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ మొత్తం అవినీతి, కులతత్వంలో కూరుకుపోయిందని సీనియర్ న్యాయమూర్తి రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ” న్యాయవ్యవస్థలో కులతత్వం, అవినీతి రాజ్యమేలుతున్నాయి. కొందరు సీనియర్ న్యాయమూర్తులు సీజేను కాకాపడుతున్నారు. వారందరూ తమ కులం, వర్గం వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకే సీజేను మంచి చేసుకుంటున్నట్టు తేలింది. ఓ నలుగురు న్యాయాధికారుల మీద 11 నుంచి 21 దాకా అభియోగపత్రాలున్నాయి. […]
న్యాయవ్యవస్థపై పట్నా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ మొత్తం అవినీతి, కులతత్వంలో కూరుకుపోయిందని సీనియర్ న్యాయమూర్తి రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
” న్యాయవ్యవస్థలో కులతత్వం, అవినీతి రాజ్యమేలుతున్నాయి. కొందరు సీనియర్ న్యాయమూర్తులు సీజేను కాకాపడుతున్నారు. వారందరూ తమ కులం, వర్గం వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకే సీజేను మంచి చేసుకుంటున్నట్టు తేలింది. ఓ నలుగురు న్యాయాధికారుల మీద 11 నుంచి 21 దాకా అభియోగపత్రాలున్నాయి. అవి అత్యంత తీవ్రమైనవి అయినప్పటికీ వారందిరినీ డిస్మిస్ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి కేవలం మందలింపుతో వదిలేశారు” అంటూ రాకేష్ కుమార్ ఒక కేసుకు సంబంధించిన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు.
సీనియర్ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించాయి. రాకేష్ చేసిన ఆరోపణలపై పట్నా చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ విచారిస్తున్న కేసులన్నింటి నుంచీ ఆయనను తప్పించారు. రాకేష్‌పై విచారణకు 11 మంది న్యాయమూర్తులతో ఒక బెంచ్‌ను హైకోర్టు సీజే ఏర్పాటు చేశారు. అయితే రాకేష్‌కు అండగా పలువురు న్యాయవాదులు నిలుస్తున్నారు.