మన్మోహన్‌ సింగ్‌కు ఎస్‌పీజీ భద్రత తొలగింపు

మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భద్రతను కుదించింది.ఇప్పటి వరకు ఆయనకు ఎస్‌పీజీ భద్రత ఉంది. ఎస్‌పీజీ భద్రతను తాజాగా తొలగించారు. మన్మోహన్‌ భద్రతను జెడ్‌ప్లస్‌కు కుదించారు. ఎస్‌పీజీ భద్రతను ప్రధానికి, మాజీ ప్రధానులకు, వారి కుటుంబసభ్యులకు ఇస్తుంటారు. ప్రస్తుతం ఎస్‌పీజీ భద్రత మోడీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఉంది. వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాతే మన్మోహన్‌కు ఎస్‌పీజీ అవసరం లేదన్న భావనతోనే […]

Advertisement
Update:2019-08-26 05:45 IST

మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భద్రతను కుదించింది.ఇప్పటి వరకు ఆయనకు ఎస్‌పీజీ భద్రత ఉంది. ఎస్‌పీజీ భద్రతను తాజాగా తొలగించారు.

మన్మోహన్‌ భద్రతను జెడ్‌ప్లస్‌కు కుదించారు. ఎస్‌పీజీ భద్రతను ప్రధానికి, మాజీ ప్రధానులకు, వారి కుటుంబసభ్యులకు ఇస్తుంటారు. ప్రస్తుతం ఎస్‌పీజీ భద్రత మోడీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఉంది.

వివిధ ఏజెన్సీల ద్వారా వచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాతే మన్మోహన్‌కు ఎస్‌పీజీ అవసరం లేదన్న భావనతోనే భద్రతను కుదించినట్టు ప్రభుత్వం చెబుతోంది.

మన్మోహన్ సింగ్ తన భద్రత గురించి ఆందోళన చెందడం లేదని… కాబట్టి ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అభ్యంతరం తెలిపే అవకాశం కూడా లేదంటున్నారు.

మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఆయన కుమార్తెకు కూడా ఎస్‌పీజీ భద్రత కల్పించారు. అయితే 2014లో యూపీఏ అధికారం కోల్పోయిన వెంటనే ఆమె ఎస్‌పీజీ భద్రత తనకు అవసరం లేదని ప్రభుత్వానికి చెప్పింది.

గతంలో మాజీ ప్రధానులు దేవేగౌడ్, వీపీ సింగ్‌లకు కూడా వారు దిగిపోగానే భద్రత కుదించారు. అయితే మాజీ ప్రధాని వాజ్‌పేయికి మాత్రం ఆయన చనిపోయే వరకు ఎస్‌పీజీ భద్రతను కొనసాగించారు.

Tags:    
Advertisement

Similar News