రాజ్ తరుణ్ కు బెయిల్.... కార్తీక్ స్టేట్ మెంట్...
కారు యాక్సిడెంట్ కేసు లో హీరో రాజ్ తరుణ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్ తరుణ్ బెయిల్ మీద విడుదలయ్యాడు. అయితే కేసుకు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాకు వివరించారు మాదాపూర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు. “హీరో రాజ్ తరుణ్ నిన్న పోలీసులకి సరెండర్ అయ్యాడు. మేము అతనిపై 41 సీఆర్పీసి నోటీసులు జారీ చేసి అతన్ని వెనక్కి పంపాము. శుక్రవారం అతనిని అరెస్టు చేసి ఐపిసి 279 మరియు 36 సెక్షన్ ల పై కేసు […]
కారు యాక్సిడెంట్ కేసు లో హీరో రాజ్ తరుణ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్ తరుణ్ బెయిల్ మీద విడుదలయ్యాడు.
అయితే కేసుకు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాకు వివరించారు మాదాపూర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు.
“హీరో రాజ్ తరుణ్ నిన్న పోలీసులకి సరెండర్ అయ్యాడు. మేము అతనిపై 41 సీఆర్పీసి నోటీసులు జారీ చేసి అతన్ని వెనక్కి పంపాము. శుక్రవారం అతనిని అరెస్టు చేసి ఐపిసి 279 మరియు 36 సెక్షన్ ల పై కేసు నమోదు చేశాం. ర్యాష్ డ్రైవింగ్ మరియు ప్రాపర్టీ డామేజ్ కేసులు నమోదు చేసిన తర్వాత అతని స్టేట్మెంట్ తీసుకొని బెయిల్ మీద విడుదల చేశాము” అని చెప్పుకొచ్చారు డిసిపి.
మరోవైపు రాజ్ తరుణ్ మానేజర్ రాజా రవీంద్ర గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ ని కార్తీక్ అనే ఒక అతను బెదిరిస్తున్నాడని యాక్సిడెంట్ కి సంబంధించి విషయాలు బయట పెడతాను అంటూ…. బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ డిఎస్పి కార్తీక్ అనే వ్యక్తిని వెతికి పట్టుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నారు పోలీసులు.
మొత్తానికి రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేస్ రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.