జైట్లీ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. జైట్లీకి ఇది వరకే కిడ్నీల మార్పిడి జరిగింది. ఆ తర్వాత ఆయన క్యాన్సర్ బారినపడ్డారు. అమెరికాలో ధీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. ఈనెల 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అనారోగ్యంతో చేరారు. జైట్లీ వయసు 66 ఏళ్ళు. అరుణ్ జైట్లీ ప్రముఖ న్యాయవాది కూడా. […]
మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
జైట్లీకి ఇది వరకే కిడ్నీల మార్పిడి జరిగింది. ఆ తర్వాత ఆయన క్యాన్సర్ బారినపడ్డారు. అమెరికాలో ధీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. ఈనెల 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అనారోగ్యంతో చేరారు. జైట్లీ వయసు 66 ఏళ్ళు.
అరుణ్ జైట్లీ ప్రముఖ న్యాయవాది కూడా. వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మోడీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అనారోగ్యం కారణంగా రెండోసారి ఆయన పదవి చేపట్టలేదు.
జైట్లీ హయాంలోనే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తీసుకొచ్చారు. జైట్లీ ఢిల్లీలో జన్మించారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లోకి విలీనం చేసింది కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే. ఢిల్లీ వర్శిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.