చిదంబరంపై కేసుల చిట్టా ఇదీ..
తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అధికారమదంతో విర్రవీగిన చిదంబరం ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. తలుపులేసుకుని ఇంట్లో దాక్కోగా అధికారులు గోడ దూకి వెళ్లి మరీ చిదంబరంను అరెస్ట్ చేసి ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చారు. చిదంబరంపై ఐఎన్‌ఎక్స్‌తో పాటు పలు తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. వాటి నుంచి కోర్టుల్లో ముందస్తు బెయిల్ సాధిస్తూ తప్పించుకుంటూ వచ్చాడు చిదంబరం. ఆయన ఇలా ఇప్పటికి 20 సార్లు కోర్టుల నుంచి ఊరట […]
తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అధికారమదంతో విర్రవీగిన చిదంబరం ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది. తలుపులేసుకుని ఇంట్లో దాక్కోగా అధికారులు గోడ దూకి వెళ్లి మరీ చిదంబరంను అరెస్ట్ చేసి ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చారు.
చిదంబరంపై ఐఎన్‌ఎక్స్‌తో పాటు పలు తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. వాటి నుంచి కోర్టుల్లో ముందస్తు బెయిల్ సాధిస్తూ తప్పించుకుంటూ వచ్చాడు చిదంబరం. ఆయన ఇలా ఇప్పటికి 20 సార్లు కోర్టుల నుంచి ఊరట పొందాడు. కానీ ఐఎన్‌ఎక్స్ కేసులో చివరకు చిప్పకూడు తినకతప్పలేదు.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం కుమారుడు కార్తీ కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు. 23 రోజులు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
చిదంబరంపై ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.1,272 కోట్ల విలువైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనూ విచారణకు హాజరు కావాలని ఇటీవలే ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
రూ.5,600 కోట్ల నేషనల్ స్పాట్ ఎక్సైంజ్ వ్యవహారంలో చిదంబరం తీసుకున్న నిర్ణయాల వల్లే తమ సంస్థ భారీగా దెబ్బతిన్నదని ‘63 మూన్స్ టెక్నాలజీస్’సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ కేసు కూడా పెండింగ్‌లో ఉంది.
బెంగాల్‌ను కంపింప చేసిన శారదా చిట్‌ఫండ్ కేసులో చిదంబరం భార్య నళిని ప్రమేయం ఉన్నట్టుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 1.4 కోట్ల రూపాయల ముడుపులు నళినికి అందినట్టుగా ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక పెద్ద మనిషి చిట్‌ఫండ్ కేసును కూడా చిదంబరం భార్యే వాదించింది.
బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015 కింద చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధిని విచారించాలంటూ ఆదాయపన్ను శాఖ జారీ చేసిన ఆదేశాలను గత ఏడాది మద్రాస్ హైకోర్టు కొట్టివేసినప్పటికీ, సుప్రీం కోర్టులో ఇంకా ఇది పెండింగ్‌లో ఉంది.
చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పడు ఇష్రాత్ జహాన్ కేసులో అఫిడవిట్‌ను తారుమారు చేసినట్టుగా ఆరోపణలున్న కేసు ఢిల్లీ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది.
గతంలో చిదంబరం వల్ల జైలుకు వెళ్లిన అమిత్ షా ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్న నేపథ్యంలో…. ఈ కేసులన్నీ వరుసగా చిదంబరానికి సినిమా చూపించడం ఖాయమని భావిస్తున్నారు.