యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ కు స్మిత్ దూరం

ఆర్చర్ బౌన్సర్ దెబ్బతో స్మిత్ కు గాయం యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో హెడింగ్లే వేదికగా ప్రారంభమయ్యే మూడుటెస్ట్ కు ముందే ఆస్ట్ర్రేలియాకు గట్టి దెబ్బతగిలింది. ప్రపంచ రెండో ర్యాంకర్, ఆస్ట్ర్రేలియా టాపార్డర్ కు వెన్నెముకలాంటి స్టీవ్ స్మిత్ గాయంతో మూడోటెస్ట్ కు దూరమైనట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో బ్రిటీష్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌన్సర్ దెబ్బకు స్మిత్ నేలమీద పడిపోయాడు. స్పృహ తప్పిన స్మిత్ […]

Advertisement
Update:2019-08-21 06:58 IST
  • ఆర్చర్ బౌన్సర్ దెబ్బతో స్మిత్ కు గాయం

యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో హెడింగ్లే వేదికగా ప్రారంభమయ్యే మూడుటెస్ట్ కు ముందే ఆస్ట్ర్రేలియాకు గట్టి దెబ్బతగిలింది.

ప్రపంచ రెండో ర్యాంకర్, ఆస్ట్ర్రేలియా టాపార్డర్ కు వెన్నెముకలాంటి స్టీవ్ స్మిత్ గాయంతో మూడోటెస్ట్ కు దూరమైనట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

లార్డ్స్ వేదికగా ముగిసిన రెండోటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో బ్రిటీష్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌన్సర్ దెబ్బకు స్మిత్ నేలమీద పడిపోయాడు. స్పృహ తప్పిన స్మిత్ చికిత్స అనంతరం బ్యాటింగ్ కొనసాగించి 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచినా.. మెడనరానికి తగిలిన గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

అంతేకాదు…మెడనొప్పి ఎక్కువ కావడంతో హెడింగ్లే వేదికగా గురువారం ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కు సైతం దూరంకాక తప్పలేదని టీమ్ డాక్టర్ ప్రకటించారు.

బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 142, రెండో ఇన్నింగ్స్ లో 144 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టెస్ట్ గా నిలిచిన స్మిత్.. రెండో టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో సైతం 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం.

ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టులు ముగిసే నాటికి 1-0 ఆధిక్యంతో ఉన్న ఆస్ట్ర్రేలియా స్మిత్ లాంటి నిలకడగా రాణించే ఆటగాడు లేకుండానే బ్యాటింగ్ కు దిగడం సాహసంగా మారింది.

Tags:    
Advertisement

Similar News