అజ్ఞాతంలోకి చిదంబరం.... ఏ క్షణమైనా అరెస్టు !
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయన అరెస్టుకు సీబీఐ, ఈడీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిదంబరం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నారనే సంగతి తెలియడం లేదు. ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశాడు… అయితే ఈ పిటీషన్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటీషన్ త్వరగా విచారించాలని కోరాడు. మరోవైపు బెయిల్ రద్దుతో సీబీఐ […]
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయన అరెస్టుకు సీబీఐ, ఈడీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిదంబరం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నారనే సంగతి తెలియడం లేదు.
ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశాడు… అయితే ఈ పిటీషన్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటీషన్ త్వరగా విచారించాలని కోరాడు.
మరోవైపు బెయిల్ రద్దుతో సీబీఐ అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లారు. ఆరుగురు అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీశారు. చిదంబరం తన నివాసంలో లేకపోవటంతో సీబీఐ అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు 305 కోట్ల రూపాయల విదేశీ నిధులు మళ్ళించేందుకు అనుమతి ఇవ్వటంలో చిదంబరం పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారం 2007లో జరిగింది.
ఇప్పటికే ఈ కేసులో నీరా రాడియా అప్రూవర్‌గా మారాడు. మనీలాండరింగ్ కేసులో చిదంబరం కొడుకు కూడా ఇంతకుముందు అరెస్టు అయ్యాడు. జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఇప్పుడు చిదంబరం వంతు వచ్చింది. ఆయన అరెస్టు కోసం సీబీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.