బీజేపీలో చేరికపై... రాములమ్మ కామెంట్స్
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి ఎట్టకేలకు కుండబద్దలు కొట్టింది. తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఏకంగా గాంధీభవన్ వెళ్లి ఉత్తమ్ కే క్లారిటీ ఇచ్చింది. గాంధీభవన్ సాక్షిగా జరుగుతున్న కుట్రకోణాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి 12 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకొని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కుదేలవ్వడం.. కేంద్రంలో బీజేపీ బలపడడంతో విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం […]
రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, రాములమ్మ విజయశాంతి ఎట్టకేలకు కుండబద్దలు కొట్టింది. తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఏకంగా గాంధీభవన్ వెళ్లి ఉత్తమ్ కే క్లారిటీ ఇచ్చింది. గాంధీభవన్ సాక్షిగా జరుగుతున్న కుట్రకోణాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన విజయశాంతి 12 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకొని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కుదేలవ్వడం.. కేంద్రంలో బీజేపీ బలపడడంతో విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రాములమ్మ ఈ విషయంపై స్పందించకపోవడంతో అందరూ పార్టీ మారుతున్నారనే అభిప్రాయానికి వచ్చారు.
కాగా తాజాగా విజయశాంతి స్పందించారు. గాంధీభవన్ లో తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని.. కాంగ్రెస్ ను వీడేది లేదని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీలో చేరుతున్నానన్న వార్తలపై తాను పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో మాట్లాడానని.. చేరడం లేదని క్లారిటీ ఇచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఇలా హడావుడి నిర్ణయాలు తీసుకోనని .. పార్టీ మారాలనుకుంటే ధైర్యంగా మీడియాకు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
ఇలా రాములమ్మపై వస్తున్న ప్రచారానికి తాజాగా ఆమె స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ ను వీడనని.. బీజేపీలో చేరనని వివరణ ఇచ్చారు. మరి గాంధీభవన్ లో విజయశాంతిపై కుట్ర చేస్తున్న ఆ నేతలు ఎవరన్నది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.