ఏనుగులూ అంతరిస్తాయా? " సీసీఎంబీ ఆందోళన

దేశంలో పులుల జాతి అంతరిస్తోంది. కోతులు కనుమరుగవుతున్నాయి. సెల్ ఫోన్లు, చెట్ల నరికివేతతో పిచ్చుకలు, కాకులు కానరావడం లేదు. అడవుల నరికివేతతో నక్కల ఊళలే వినిపించడం లేదు. తోడేళ్ల తోడు లేకుండా పోయింది. ఉడుతల ఊసే లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఏనుగులు కూడా చేరుతున్నాయని జంతు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రదర్శన శాలలు, ఊరేగింపులు, సర్కస్ లలో ఏనుగులపై శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, దీని ప్రభావం ఏనుగుల సంతానోత్పత్తిపై పడుతోందని […]

Advertisement
Update:2019-08-18 05:03 IST

దేశంలో పులుల జాతి అంతరిస్తోంది. కోతులు కనుమరుగవుతున్నాయి. సెల్ ఫోన్లు, చెట్ల నరికివేతతో పిచ్చుకలు, కాకులు కానరావడం లేదు. అడవుల నరికివేతతో నక్కల ఊళలే వినిపించడం లేదు. తోడేళ్ల తోడు లేకుండా పోయింది. ఉడుతల ఊసే లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఏనుగులు కూడా చేరుతున్నాయని జంతు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జంతు ప్రదర్శన శాలలు, ఊరేగింపులు, సర్కస్ లలో ఏనుగులపై శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, దీని ప్రభావం ఏనుగుల సంతానోత్పత్తిపై పడుతోందని సీసీఎంబీ – జంతు జాతుల ప్రయోగశాల (లాకోన్స్)కు చెందిన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివిధ చోట్ల పలు అవసరాల కోసం నిర్భంధంలో ఉన్న ఏనుగుల ఆరోగ్యాన్ని శాస్త్రవేత్తలు డాక్టర్ జీ.ఉమాపతి, రాజశేఖర్, వినోద్ కుమార్, ముత్తులింగం, ప్రదీప్, ఆదిశేషు పరిశీలించారు.

మైసూరులోని జంతు ప్రదర్శన శాల, మైసూర్ దసరా ఉత్సవం, బంధవ్ గడ్, మధుమలై ప్రాంతాలలో వీరు ప్రయోగాలను నిర్వహించారు.

ఇక్కడ నిర్భంధంలో ఉన్న 37 ఏనుగుల నుంచి 870 నమూనాలను సేకరించారు.
ఈ నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

వివిధ ప్రదర్శనలు, ఊరేగింపులు, సర్కస్ లలో చేసే విన్యాసాల కారణంగా ఏనుగులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఒత్తిడి హార్మోన్లను విడుదల చేసే గ్లూకో కార్టికాయిడ్ జీవ క్రియలను పరీక్షించారు ఈ శాస్త్రవేత్తలు.24 ఆడ ఏనుగుల, 13 మగ ఏనుగుల నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏనుగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని తేల్చారు.

మైసూరులోని జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఏనుగు కంటే దసరా ఉత్సవాల సందర్భంగా ఊరేగింపులో పాల్గొనే ఏనుగుల్లో ఒత్తిడి తీవ్రంగా ఉందని నిర్దారించారు. దీని కారణంగా ఏనుగుల సంఖ్య భవిష్యత్ లో తగ్గుతుందనే ఆందోళనను వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు.

Tags:    
Advertisement

Similar News