గోవుల మృతిపై సిట్ ఏర్పాటు
విజయవాడలోని గోశాలలో 100 ఆవులు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న గోశాలకు చెందిన వంద ఆవులు శ్రుకవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 100 గోవులు మరణించడంతో పాటు మరికొన్ని ఆవులు కూడా అనారోగ్యం పాలయ్యాయి. పశువులకు ఇచ్చే దాణాలో విషాహారం కలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గోశాల నిర్వాహకులు వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటనపై పూర్తి స్ధాయి విచారణకు […]
విజయవాడలోని గోశాలలో 100 ఆవులు మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న గోశాలకు చెందిన వంద ఆవులు శ్రుకవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో 100 గోవులు మరణించడంతో పాటు మరికొన్ని ఆవులు కూడా అనారోగ్యం పాలయ్యాయి. పశువులకు ఇచ్చే దాణాలో విషాహారం కలిసి ఉండవచ్చుననే అనుమానాన్ని గోశాల నిర్వాహకులు వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటనపై పూర్తి స్ధాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సిట్ ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.
ఏసీపీ స్ధాయి ఉన్నతాధికారి పర్యవేక్షణలో సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ గోశాలలో మరణించిన గోవులతో సహా 300 ఆవులు ఉన్నాయి. గతంలో కూడా ఈ గోశాలలో 24 ఆవులకు పైగా మరణిచాయి. ఇది అప్పట్లో తీవ్ర సంచలనమయ్యింది.
గోశాలలో ఇన్నిగోవులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దిగ్బ్ర్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సంచలన సంఘటన జరిగిన మూడు రోజుల్లోనే దానిపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గలు చెబుతున్నాయి.