తిట్టుకున్న ఇద్దరు మాజీ సీఎం లు

కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆర్టికల్ 370రద్దు నేపథ్యంలో ఇద్దరు సీఎంలను హరి నివాస్ ప్యాలెస్ లో ఉంచారు. ఆ సమయంలో ఎదురుపడి ఇద్దరూ వాదించు కున్నారు. ఒక దశలో ముఫ్తీ పై ఒమర్ నోరు చేసుకున్నారు. కాశ్మీరులో కి బీజేపీ అడుగు పెట్టడానికి కారణం మీరంటే మీరే అని తిట్టుకున్నా రు. 2015-2018 మధ్య బీజేపీతో పీడీపీ చెలిమి చేయడం వల్లే ఈ పరిస్థితి […]

Advertisement
Update:2019-08-13 05:12 IST

కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆర్టికల్ 370రద్దు నేపథ్యంలో ఇద్దరు సీఎంలను హరి నివాస్ ప్యాలెస్ లో ఉంచారు. ఆ సమయంలో ఎదురుపడి ఇద్దరూ వాదించు కున్నారు.

ఒక దశలో ముఫ్తీ పై ఒమర్ నోరు చేసుకున్నారు. కాశ్మీరులో కి బీజేపీ అడుగు పెట్టడానికి కారణం మీరంటే మీరే అని తిట్టుకున్నా రు. 2015-2018 మధ్య బీజేపీతో పీడీపీ చెలిమి చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఒమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు ముఫ్తీ కూడా తీవ్రంగా స్పందించారు. మీ తండ్రి వాజ్ పెయి హయాంలో బీజేపీతో కలిసి ఉన్న విషయం మరిచిపోయారా? అంటూ నిలదీశారు. అసలు కాశ్మీర్ ను భారత్ లో కలపడానికి కారణమే మీ తాత షేక్ అబ్దుల్లా అంటూ ముఫ్తీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాంతో మాట మాట పెరిగి ముఫ్తీ పై ఒమర్ గట్టిగా కేకలు వేశారు.

Tags:    
Advertisement

Similar News