పోలీసుల సరికొత్త ఆయుధం ‘వాట్సాప్’

వాట్సాప్. ఇప్పుడు మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తికి నిత్యావసరంగా మారిన సోషల్ మీడియా యాప్. ఏ సమాచారం అయినా క్షణాల్లో అవతలి వ్యక్తికి పంపేలా ఉండడంతో ఇదొక అత్యవసర యాప్ గా మారిపోయింది. ఇప్పుడు వాట్సాప్ తోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్న వారు ఎందరో…! ఆఫీసుల్లో ఉద్యోగులు, బంధువులు, కాలనీ వాసులు, ప్రజలు ఎంతో మంది గ్రూపులుగా ఏర్పడి సమస్యలు పరిష్కరించుకుంటూ సామాజిక సేవలో సైతం ‘వాట్సాప్’ను కీలకంగా ఉపయోగిస్తున్నారు. అయితే అందరికీ చేరువైన ఈ యాప్ […]

Advertisement
Update:2019-08-12 00:32 IST

వాట్సాప్. ఇప్పుడు మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తికి నిత్యావసరంగా మారిన సోషల్ మీడియా యాప్. ఏ సమాచారం అయినా క్షణాల్లో అవతలి వ్యక్తికి పంపేలా ఉండడంతో ఇదొక అత్యవసర యాప్ గా మారిపోయింది.

ఇప్పుడు వాట్సాప్ తోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్న వారు ఎందరో…! ఆఫీసుల్లో ఉద్యోగులు, బంధువులు, కాలనీ వాసులు, ప్రజలు ఎంతో మంది గ్రూపులుగా ఏర్పడి సమస్యలు పరిష్కరించుకుంటూ సామాజిక సేవలో సైతం ‘వాట్సాప్’ను కీలకంగా ఉపయోగిస్తున్నారు.

అయితే అందరికీ చేరువైన ఈ యాప్ నే ఆయుధంగా మార్చేస్తున్నారు పోలీసులు. వాట్సాప్ ను ఫిర్యాదులకు, సమస్యల పరిష్కారాలకు ఉపయోగించడం మొదలు పెట్టారు. తెలంగాణలో మొదలైన ఈ కొత్త సంస్కృతి ఇప్పుడు బాధితులకు వరంగా.. పోలీసులకు శాంతి భద్రతల పర్యవేక్షణలో కీలకంగా మారుతోంది.

తెలంగాణలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల ఎస్పీలు తాజాగా జిల్లాలో ఏ మూల ఏం జరిగినా ఫిర్యాదు చేయవచ్చని.. తాము అండగా ఉంటామని.. వివరాలు గోప్యంగా ఉంచి న్యాయం చేస్తామంటూ ప్రజలకు వాట్సాప్ నంబర్ లు ఇస్తున్నారు. వాట్పాప్ కు ఫిర్యాదు చేస్తే చాలూ… తామే అంతా చూసుకుంటామంటూ భరోసానిస్తున్నారు.

తెలంగాణ పోలీస్ శాఖ జిల్లాకు ఒకటి చొప్పున రిలీజ్ చేస్తున్న ఈ వాట్సాప్ నంబర్లు ఆయా జిల్లా ప్రజలకు ఊరటనిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే కామన్ వాట్సాప్ నంబర్ పనిచేసేలా పోలీస్ శాఖ తీర్చిదిద్దితే అది అందరికీ చేరువయ్యే అవకాశం ఉందని.. ఆ దిశగా పోలీస్ శాఖ చేయాలని పలువురు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News