నన్ను బెదిరిస్తున్నారు... అందుకే ట్విట్టర్‌ నుంచి తప్పుకుంటున్నా...

దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అనురాగ్ కశ్వప్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు కొందరు తనను, తన కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జైశ్రీరాం నినాదంతో జరుగుతున్న మూకదాడులకు వ్యతిరేకంగా ఇటీవల కొందరు సెలబ్రెటీలు గళమెత్తగా వారిలో అనురాగ్ కశ్వప్ కూడా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. తన పరిస్థితిని వివరిస్తూ అనురాగ్ రెండు ట్వీట్లు […]

Advertisement
Update:2019-08-12 02:36 IST

దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అనురాగ్ కశ్వప్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు కొందరు తనను, తన కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

జైశ్రీరాం నినాదంతో జరుగుతున్న మూకదాడులకు వ్యతిరేకంగా ఇటీవల కొందరు సెలబ్రెటీలు గళమెత్తగా వారిలో అనురాగ్ కశ్వప్ కూడా ఉన్నారు.

ఈనేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చాయి. తన పరిస్థితిని వివరిస్తూ అనురాగ్ రెండు ట్వీట్లు చేశారు. ”మీ తల్లిదండ్రులకు, పిల్లలకు ఫోన్‌ ద్వారా బెదిరింపులు వచ్చినప్పుడు ఎవరూ అండగా మాట్లాడరని తెలుసు. దేశంలో దొంగల పాలన నడుస్తోంది. వారు కొత్త జీవన విధానాన్ని సృష్టిస్తారు. ఈ నవ భారతంలో ప్రతి ఒక్కరికీ అభినందనలు” అంటూ తొలి ట్వీట్ చేశారు. ఈ వెంటనే ” నేను ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నా. ఇదే నా చివరి ట్వీట్ అంటూ స్పందించారు.

”ఎలాంటి భయం లేకుండా నా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం నాకు లేనప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. గుడ్‌బై” అంటూ మరో ట్వీట్ చేశారు అనురాగ్ కశ్వప్.

అనురాగ్ ప్రకటనపై పలువురు ఆయనకు సంఘీభావం తెలిపారు. స్వేచ్చగా అభిప్రాయాలు చెప్పుకునే పరిస్థితి దేశంలో లేకుండా పోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News