అమెరికాకు సీఎం జగన్ పయనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ వారం రోజుల పాటు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినా అమెరికాలో స్థిరపడిన తెలుగు వారితో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 17 వ తేదీన డల్లాస్ […]

Advertisement
Update:2019-08-11 03:07 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమెరికా పయనమవుతున్నారు. ఈ నెల 15 వ తేదీన అమెరికా వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ వారం రోజుల పాటు ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 వ తేదీన జరిగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు బయలుదేరుతారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినా అమెరికాలో స్థిరపడిన తెలుగు వారితో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నెల 17 వ తేదీన డల్లాస్ లోని కన్వెన్షన్ హాలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఉన్న తెలుగు వారితో సమావేశమవుతారు. ఈ సమావేశంలో హాజరయ్యేందుకు అమెరికాలోని వివిధ రాష్ట్ర్రాలలో ఉన్న తెలుగు వారందరికి ఆహ్వానాలు అందినట్లు చెబుతున్నారు.

“వెల్ కం సీఎం” అంటూ ఇప్పటికే ప్రవాస తెలుగు ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారి చిన్నారులతో ఆదివారం నాడు వెల్ కం సీఎం అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖులు.

గతంలో ముఖ్యమంత్రి హోదాలో దివంగత నాయకుడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమెరికా పర్యటించారు. ఆ సమయంలో కూడా రాజశేఖర రెడ్డి డల్లాస్ లో తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు ఆయన వారసుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో అమెరికాలో పర్యటించడం ఆనందంగా ఉందని అక్కడ స్థిరపడిన తెలుగు వారు అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి తొలిసారి అమెరికాకు వస్తున్న సందర్భంగా అపూర్వరీతిలో స్వాగతం పలుకుతామని చెప్పారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల తెలుగు వారికి ఆహ్వానాలు పంపించి ఇతర ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News