జగన్‌కు తమిళనాడు మంత్రుల కృతజ్ఞతలు

తమిళనాడు మంత్రుల బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసింది. తీవ్ర నీటి ఎద్దడితో చెన్నై పట్టణం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నీరు విడుదల చేయాల్సిందిగా జగన్‌ మోహన్‌ రెడ్డిని తమిళ మంత్రులు కోరారు. ఇందుకు జగన్‌ సానుకూలంగా స్పందించారు. తోటి వారు ఇబ్బందుల్లో ఉంటే తప్పకుండా స్పందిస్తామన్నారు. చెన్నై తాగునీటి సమస్య తీవ్రత దృష్ణ్యా నీటిని విడుదల చేస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెన్నైకి తాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా […]

Advertisement
Update:2019-08-09 13:35 IST

తమిళనాడు మంత్రుల బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసింది. తీవ్ర నీటి ఎద్దడితో చెన్నై పట్టణం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నీరు విడుదల చేయాల్సిందిగా జగన్‌ మోహన్‌ రెడ్డిని తమిళ మంత్రులు కోరారు. ఇందుకు జగన్‌ సానుకూలంగా స్పందించారు. తోటి వారు ఇబ్బందుల్లో ఉంటే తప్పకుండా స్పందిస్తామన్నారు.

చెన్నై తాగునీటి సమస్య తీవ్రత దృష్ణ్యా నీటిని విడుదల చేస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చెన్నైకి తాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు జగన్‌. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో చెన్నైకి నీరు విడుదలకు ఇబ్బంది ఏమీ లేదని అధికారులు వివరించారు.

జగన్‌ వెంటనే సానుకూలంగా స్పందించడం పట్ల తమిళ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. తమిడనాడు సీఎం ఆదేశంతో మున్సిపల్‌ శాఖా మంత్రి గణేశన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖా మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌ శుక్రవారం సీఎం జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌కు వారు సన్మానం చేశారు.

Tags:    
Advertisement

Similar News