సౌతాఫ్రికా క్రికెట్లో రిటైర్మెంట్ల పర్వం

మూడురోజుల్లో ఇద్దరు సీనియర్ల రిటైర్మెంట్  ఓపెనింగ్ బౌలర్ స్టెయిన్, ఓపెనర్ ఆమ్లా అల్విదా సౌతాఫ్రికా సీనియర్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా క్రికెట్ మూడు ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పాడు. ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ లో తమజట్టు దారుణంగా విఫలం కావడంతో… ఆమ్లా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొన్నాడు. రెండురోజుల క్రితమే ఓపెనింగ్ బౌలర్ డేల్ స్టెయిన్ గుడ్ బై చెప్పగా…ఇప్పుడు ఆమ్లా విరమించుకొన్నాడు. ఆమ్లాకు 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ-20 మ్యాచ్ లు ఆడిన […]

Advertisement
Update:2019-08-09 06:42 IST
  • మూడురోజుల్లో ఇద్దరు సీనియర్ల రిటైర్మెంట్
  • ఓపెనింగ్ బౌలర్ స్టెయిన్, ఓపెనర్ ఆమ్లా అల్విదా

సౌతాఫ్రికా సీనియర్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా క్రికెట్ మూడు ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పాడు. ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ లో తమజట్టు దారుణంగా విఫలం కావడంతో… ఆమ్లా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొన్నాడు. రెండురోజుల క్రితమే ఓపెనింగ్ బౌలర్ డేల్ స్టెయిన్ గుడ్ బై చెప్పగా…ఇప్పుడు ఆమ్లా విరమించుకొన్నాడు.

ఆమ్లాకు 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ-20 మ్యాచ్ లు ఆడిన అసాధారణ రికార్డు ఉంది. సౌతాఫ్రికా టాపార్డర్ ఆటగాడిగా 124 టెస్టులు, 215 ఇన్నింగ్స్ ఆడిన ఆమ్లాకు 9వేల 282 పరుగులు సాధించాడు. ఇందులో 28 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు ఉన్నాయి.

టెస్ట్ క్రికెట్లో 46.64 సగటు సాధించిన ఆమ్లా 181 వన్డేల్లో 27 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో సహా 8వేల 113 పరుగులు సైతం సాధించాడు.

ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ లో సౌతాఫ్రికా ఓపెనర్ గా 7 మ్యాచ్ లు ఆడిన ఆమ్లా 203 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

గత మూడురోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించిన రెండో సౌతాఫ్రికా క్రికెటర్ గా ఆమ్లా నిలిచాడు.

వైట్ లైట్నింగ్ డేల్ స్టెయిన్ సైతం కొద్దిరోజుల క్రితమే క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

స్టెయిన్ టెస్ట్ క్రికెట్ కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించగా… ఆమ్లా మాత్రం మూడు ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పడం విశేషం.

Tags:    
Advertisement

Similar News