నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే....

ఆర్టికల్ 370 రద్దును బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వాగతించారు. తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమేనని చెప్పారు. భారత్‌కు పీవోకేని తిరిగి అప్పగించడం మినహా పాకిస్థాన్‌ ప్రధానికి మరో దారి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినా పీవోకేని భారత్‌కు అప్పగించాల్సిందిగా చెప్పడం మినహా ఏమీ ఉండదన్నారు. పీవీ నరసింహారావు ప్రభుత్వ సమయంలోనూ పీవోకేను భారత్‌లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ […]

Advertisement
Update:2019-08-06 03:15 IST

ఆర్టికల్ 370 రద్దును బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వాగతించారు. తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమేనని చెప్పారు.

భారత్‌కు పీవోకేని తిరిగి అప్పగించడం మినహా పాకిస్థాన్‌ ప్రధానికి మరో దారి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినా పీవోకేని భారత్‌కు అప్పగించాల్సిందిగా చెప్పడం మినహా ఏమీ ఉండదన్నారు.

పీవీ నరసింహారావు ప్రభుత్వ సమయంలోనూ పీవోకేను భారత్‌లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్‌ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ వాదన అజ్ఞానంతో కూడుకుని ఉందని విమర్శించారు స్వామి. ఆర్టికల్‌370 రద్దు ఇప్పటికే ఆలస్యమైందని… ఆర్టికల్‌ రద్దు ఏకపక్షమని వాదించేవారికి.. 5లక్షల మంది కాశ్మీరీ పండిట్‌లను, సిక్కులను తరిమివేసిన రోజు గుర్తులేదా అని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News