ఫరూక్ అబ్దుల్లా సంచలన ఆరోపణలు
కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎంపీ ఫరూక్ అబ్దుల్లా లోక్‌సభకు రాకపోవడంతో ఆయన ఎక్కడున్నారన్న దానిపై సభలో విపక్ష సభ్యులు ప్రశ్నించారు. అయితే తాము ఫరూక్‌ను అరెస్ట్ చేయలేదని, నిర్బంధించలేదని అమిత్ షా చెప్పారు. ఇంతలో ఫరూక్ అబ్దుల్లా తన ఇంటి వద్దే పోలీసుల సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ఇంటి గుమ్మం వద్ద నిల్చొని మీడియాతో కాసేపు మాట్లాడారు. తమను హత్య చేసేందుకు అమిత్ షా కుట్ర చేశారని ఫరూక్ ఆరోపించారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను […]
కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఎంపీ ఫరూక్ అబ్దుల్లా లోక్‌సభకు రాకపోవడంతో ఆయన ఎక్కడున్నారన్న దానిపై సభలో విపక్ష సభ్యులు ప్రశ్నించారు. అయితే తాము ఫరూక్‌ను అరెస్ట్ చేయలేదని, నిర్బంధించలేదని అమిత్ షా చెప్పారు.
ఇంతలో ఫరూక్ అబ్దుల్లా తన ఇంటి వద్దే పోలీసుల సమక్షంలోనే మీడియాతో మాట్లాడారు. ఇంటి గుమ్మం వద్ద నిల్చొని మీడియాతో కాసేపు మాట్లాడారు. తమను హత్య చేసేందుకు అమిత్ షా కుట్ర చేశారని ఫరూక్ ఆరోపించారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను అరెస్ట్ చేశారన్నారు. కశ్మీర్ ముఖ్యనేతలందరినీ నిర్బంధించి రహస్య ప్రదేశాల్లో ఉంచారన్నారు.
తనను గృహనిర్బంధంలో ఉంచారని.. ఎవరినీ కలవనివ్వడం లేదన్నారు. మోడీ ఒక నియంతలా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌజ్ అరెస్ట్ చేయలేదంటూ లోక్‌సభ వేదికగా హోంమంత్రి అమిత్ షా అబద్దాలు చెప్పారన్నారు.
కశ్మీర్ ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఫరూక్ ఇంటి వద్ద ప్రస్తుతం భారీగా మిలటరీని మోహరించారు.