కశ్మీర్‌ను మరో పాలస్తీనా చేస్తున్నారు

కశ్మీర్ విభజనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన అసద్‌… ఇండియాను కూడా చైనాలా తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ సమస్యను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు. దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా చేస్తున్నారని ఓవైసీ మండిపడ్డారు. కశ్మీర్‌ను మరో పాలస్తీనా చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దేశంలో నాజీల తరహా పాలన సాగుతోందన్నారు. కశ్మీర్‌ ప్రజలను విభజిచి పాలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాజీ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందన్నారు. కశ్మీర్ ప్రజలు […]

Advertisement
Update:2019-08-06 11:57 IST

కశ్మీర్ విభజనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన అసద్‌… ఇండియాను కూడా చైనాలా తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కశ్మీర్ సమస్యను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు. దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా చేస్తున్నారని ఓవైసీ మండిపడ్డారు. కశ్మీర్‌ను మరో పాలస్తీనా చేయాలనుకుంటున్నారని విమర్శించారు.

దేశంలో నాజీల తరహా పాలన సాగుతోందన్నారు. కశ్మీర్‌ ప్రజలను విభజిచి పాలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాజీ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందన్నారు.

కశ్మీర్ ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే బీజేపీ వాళ్లు మాత్రం దీపావళి చేసుకుంటున్నారని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News