కశ్మీర్‌ నేతల హౌజ్ అరెస్ట్

కశ్మీర్‌లో అసాధారణ నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం అందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కశ్మీర్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే భారీగా ఆర్మీని మోహరించింది. పర్యటకులను పూర్తిగా కశ్మీర్‌ నుంచి బయటకు పంపించి వేసింది. అర్థరాత్రి మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 144 సెక్షన్‌ను ప్రయోగించారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పలువురు కీలక నేతలను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు. కశ్మీర్‌ మొత్తం మొబైల్, ఇంటర్‌నెట్‌ను పూర్తిగా […]

Advertisement
Update:2019-08-05 03:55 IST

కశ్మీర్‌లో అసాధారణ నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైన కేంద్రం అందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. కశ్మీర్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే భారీగా ఆర్మీని మోహరించింది.

పర్యటకులను పూర్తిగా కశ్మీర్‌ నుంచి బయటకు పంపించి వేసింది. అర్థరాత్రి మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 144 సెక్షన్‌ను ప్రయోగించారు.

మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. పలువురు కీలక నేతలను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు. కశ్మీర్‌ మొత్తం మొబైల్, ఇంటర్‌నెట్‌ను పూర్తిగా నిలిపేశారు. పుకార్లు వ్యాపించకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం స్తంభింపచేశారు.

అర్థరాత్రి గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌తో ఆ రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలు భేటీ అయి పరిస్థితిని వివరించారు. ఈ అసాధారణ చర్యల నేపథ్యంలో నేడు కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌పై అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతోందని స్పష్టమైంది.

Tags:    
Advertisement

Similar News