రోజంతా ముసురే.... మరో రెండు రోజులు ఇదే తీరు..!

కరువు తీరింది. వర్షాల కోసం వేచి చూసిన కళ్లు తెప్పరిల్లాయి. చెరువులు, కుంటలు నిండు కుండలా కళకళాలాడుతున్నాయి. రైతుల కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. గురువారం తెలుగు రాష్ట్ర్రాల్లో ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా శుక్రవారం అంతా కురుస్తూనే ఉంది. రెండు రాష్ట్రాల్లోని రైతులు వరి నాట్లను ముమ్మరం చేశారు. వానాకాలం ప్రారంభమైనా వర్షం కోసం రైతులు ఆకాశం వైపు చూస్తూనే గడిపారు. వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేశారు. యాగాలు చేశారు. అయినా కరుణించని వరుణుడు శుక్రవారం […]

Advertisement
Update:2019-08-03 05:05 IST

కరువు తీరింది. వర్షాల కోసం వేచి చూసిన కళ్లు తెప్పరిల్లాయి. చెరువులు, కుంటలు నిండు కుండలా కళకళాలాడుతున్నాయి. రైతుల కళ్లలో ఆనందం తొణికిసలాడుతోంది. గురువారం తెలుగు రాష్ట్ర్రాల్లో ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా శుక్రవారం అంతా కురుస్తూనే ఉంది. రెండు రాష్ట్రాల్లోని రైతులు వరి నాట్లను ముమ్మరం చేశారు.

వానాకాలం ప్రారంభమైనా వర్షం కోసం రైతులు ఆకాశం వైపు చూస్తూనే గడిపారు. వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేశారు. యాగాలు చేశారు. అయినా కరుణించని వరుణుడు శుక్రవారం నాడు రోజంతా కరుణించాడు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. రెండు జిల్లాలోని ప్రధాన జల వనరులన్నీ వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద, తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది.

విశాఖపట్నంలోని ముడసర్లోవ, మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ కూడా కళకళలాడుతోంది. దీంతో విశాఖ వాసుల మంచి నీటి కష్టాలు కడతేరతాయని అధికారులు చెబుతున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసాయి.

ఉభయ గోదావరి జిల్లాల్లో గురువారం ప్రారంభమైన వర్షం శుక్రవారమంతా కురిసింది. దీంతో ఈ రెండు జిల్లాల్లోని గోదావరి పాయల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదులు కూడా జల కళను సంతరించుకున్నాయి.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో సహా నిజామాబాద్, వరంగల్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని లక్కవరం సరస్సు నీటి మట్టం 28.5 అడుగులకు చేరుకుంది. పాకల సరస్సులో 11 అడుగుల మేర నీరు చేరింది.

శ్ర్రీశైలం వద్ద వరద ప్రవాహం తీవ్రమైంది. భూపాలపల్లిలోని ఓపెన్‌ కాస్ట్‌లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర్రంలోని అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురియడంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు.

ప్రతి ఏటా ఈ సీజన్ లో కురియాల్సిన వర్షపాతం రెండు రోజుల్లోనే కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఆదివారం నాడు మరో అల్పపీడనం ఏర్పడనున్నదని వారు తెలిపారు. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్ర్రాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.

Tags:    
Advertisement

Similar News