విఫలమైన అయోధ్య మధ్యవర్తిత్వం

అయోధ్య సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది. కలీపుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్‌లతో కూడిన కమిటీని మార్చి 8న సుప్రీంకోర్టు నియమించింది. మధ్యవర్తిత్వం చేసి సమస్యకు పరిష్కారం కనుక్కొని నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆగస్ట్ 1న కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. నివేదికను పరిశీలించామని… కమిటీ ప్రయత్నం విఫలమైందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఇకపై అయోధ్య కేసును తామే పరిష్కరిస్తామని ప్రకటించారు. […]

Advertisement
Update:2019-08-03 03:30 IST

అయోధ్య సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైంది. కలీపుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరామ్‌లతో కూడిన కమిటీని మార్చి 8న సుప్రీంకోర్టు నియమించింది.

మధ్యవర్తిత్వం చేసి సమస్యకు పరిష్కారం కనుక్కొని నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆగస్ట్ 1న కమిటీ తమ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. నివేదికను పరిశీలించామని… కమిటీ ప్రయత్నం విఫలమైందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో ఇకపై అయోధ్య కేసును తామే పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈనెల ఆరు నుంచి వాద ప్రతివాదనలు ముగిసే వరకు రోజువారిగా వాదనలు వింటామని సీజే వెల్లడించారు. ఈ అంశాన్ని తామే తేలుస్తామని స్పష్టం చేశారు.

మధ్యవర్తిత్వం విఫలమైన నేపథ్యంలో ఈనెల ఆరు నుంచి రోజువారీగా తాము కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ స్వాగతించింది.

అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని తమకు కేటాయించాలంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన హైకోర్టు నలుగురు ప్రధాన పిటిషనర్లకు స్థలాన్ని సమంగా పంచాలని 2010లో తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేసును సుప్రీం కోర్టు విచారిస్తోంది.

Tags:    
Advertisement

Similar News