'రాక్షసుడు' సినిమా రివ్యూ

రివ్యూ : రాక్షసుడు రేటింగ్ : 2.75/5 తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌‌, రాజీవ్‌ కనకాల తదితరులు సంగీతం : జిబ్రాన్‌ నిర్మాత : కోనేరు సత్యనారాయణ దర్శకత్వం : రమేష్‌ వర్మ అరుణ్ (శ్రీనివాస్ బెల్లంకొండ) దర్శకుడు అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అయితే అనేక కారణాల వలన ఆ డ్రీం అలా ఉండిపోతుంది. ఈ లోపు పరిస్థితులకి తలొగ్గి పోలీస్ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అప్పుడే ఉద్యోగం లో జాయిన్ అయిన […]

Advertisement
Update:2019-08-02 11:03 IST

రివ్యూ : రాక్షసుడు
రేటింగ్ : 2.75/5
తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరన్‌‌, రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం : జిబ్రాన్‌
నిర్మాత : కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం : రమేష్‌ వర్మ

అరుణ్ (శ్రీనివాస్ బెల్లంకొండ) దర్శకుడు అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అయితే అనేక కారణాల వలన ఆ డ్రీం అలా ఉండిపోతుంది. ఈ లోపు పరిస్థితులకి తలొగ్గి పోలీస్ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అప్పుడే ఉద్యోగం లో జాయిన్ అయిన అతనికి ఒక ఆసక్తికరమైన కేసు తగులుతుంది. ఒక సైకో కిల్లర్ సిటీ లో ఉన్న అమ్మాయిలని కిడ్నాప్ చేస్తూ పోలీసులకి నిద్ర పట్టకుండా చేస్తాడు. ఒక్కొక్క క్లూ ని ఛేదిస్తూ ముందుకు వెళ్తున్న అరుణ్ కి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. తన ఉద్యోగం ప్రమాదకరం గా మారే పరిస్థితి వస్తుంది. ఆ సమయం లో అరుణ్ ఏం చేస్తాడు? ఈ కేసు ని ఎలా చేధిస్తాడు? చివరికి ఏం జరుగుతుంది? అనేది సినిమా కథ.

ఈ సినిమా లో బెల్లంకొండ శ్రీనివాస్ నటన చాలా గొప్పగా ఉంది. ఇప్పటి వరకు తనకి ఉన్న మాస్ ఇమేజ్ కి కొంచెం పక్కకి వచ్చి, ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నించాడు శ్రీనివాస్. తన నటన మునుపటి సినిమాల కన్నా చాలా మెరుగైంది అని చెప్పుకోవచ్చు. తన పాత్ర మేరకు తన పరిధి లో ఉన్నంత వరకు శ్రీనివాస్ బాగా నటించాడు. అదే విధం గా ఈ సినిమా లో హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్ర లో ఒదిగిపోయింది. మంచి ఎమోషన్స్ ని పండించి అందరినీ మెప్పించే ప్రయత్నం చేసింది. రాజీవ్ కనకాల ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసాడు. ఒక పర్టిక్యులర్ సీన్ లో అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందాడు అని చెప్పుకోవచ్చు. కాశి విశ్వనాధ్, కోటేష్ మన్నవ, మరి కొందరు కూడా తమ పాత్రల మేరకు నటించి అందరినీ మెప్పించారు.

ఈ సినిమా కి జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఎంతగానో ఉపయోగపడింది. చివరి 20 నిముషాలు సినిమాని సంగీతం బాగా ప్రభావితం చేస్తుంది. ఈ సినిమా టెక్నికల్ గా బాగా రిచ్ గా ఉంది. కెమెరా వర్క్ చాలా బాగా కుదిరింది. ఎడిటింగ్ కూడా బాగా చేయడం తో ప్రేక్షుకులకి పెద్దగా బోర్ ఫీలింగ్ రాదు. దర్శకుడు రమేష్ వర్మ మంచి కథ ని తెలుగు ప్రేక్షకుల కోసం మంచిగా మలుచుకున్నారు.

ఈ సినిమా లో ని కాన్సెప్ట్ చాలా కొత్తది. ఆసక్తికరమైన కథ ని తీసుకొని ప్రేక్షకులని కట్టి పడేసే స్క్రీన్‌ ప్లే తో దర్శకుడు రమేష్ వర్మ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది అని చెప్పుకోవచ్చు. ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నం ఎంత కష్టం గా ఉంటుంది అని చాలా బాగా చూపించారు. దొంగ-పొలీసు ఛేజ్ వలె ఈ సినిమా లో విలన్ ని పట్టుకోవాలని హీరో చేసే ప్రయత్నం అందరినీ ఎంతగానో అలరిస్తుంది. రియలిస్టిక్ గా ఈ సినిమా తీయడం చాలా గొప్ప విషయం. కొన్ని సినిమాలు ఇంత రియలిస్టిక్ గా రావు. కానీ చిత్ర యూనిట్ ఆ విషయంలో మంచి శ్రద్ద కనబరిచింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్, క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. చివరగా చెప్పాలంటే, ఈ సినిమా తప్పకుండా అందరినీ ఎంతగానో అలరిస్తుంది.

Tags:    
Advertisement

Similar News