క్రికెట్ కు మేడిన్ ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు గుడ్ బై

15 ఏళ్ల క్రికెట్ కెరియర్ కు అల్విదా అంతర్జాతీయ క్రికెట్లో ఆంధ్ర రెండో క్రికెటర్ వేణుగోపాల రావు మేడిన్ ఆంధ్ర అంతర్జాతీయ క్రికెటర్ వేణుగోపాలరావు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.ఆంధ్ర, గుజరాత్ , భారత జట్లకు సేవలు అందించిన వేణు 16 ఏళ్ల తన కెరియర్ కు గుడ్ బై చెప్పడం ద్వారా..తెలుగు క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడాలని నిర్ణయించాడు. విశాఖ టు టీమిండియా… ఆంధ్ర క్రికెట్ నుంచి భారతజట్టులో చోటు సంపాదించిన ఇద్దరు ఆటగాళ్లలో వేణుగోపాలరావు ఒకడిగా గుర్తింపు […]

Advertisement
Update:2019-08-01 07:05 IST
  • 15 ఏళ్ల క్రికెట్ కెరియర్ కు అల్విదా
  • అంతర్జాతీయ క్రికెట్లో ఆంధ్ర రెండో క్రికెటర్ వేణుగోపాల రావు

మేడిన్ ఆంధ్ర అంతర్జాతీయ క్రికెటర్ వేణుగోపాలరావు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.ఆంధ్ర, గుజరాత్ , భారత జట్లకు సేవలు అందించిన వేణు 16 ఏళ్ల తన కెరియర్ కు గుడ్ బై చెప్పడం ద్వారా..తెలుగు క్రికెట్ వ్యాఖ్యాతగా స్థిరపడాలని నిర్ణయించాడు.

విశాఖ టు టీమిండియా…

ఆంధ్ర క్రికెట్ నుంచి భారతజట్టులో చోటు సంపాదించిన ఇద్దరు ఆటగాళ్లలో వేణుగోపాలరావు ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. భారత ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. అంతర్జాతీయ క్రికెట్లో పాల్గొన్న తొలి ఆటగాడు కాగా…వేణు రెండో క్రికెటర్ గా నిలిచాడు.

స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వేణుగోపాలరావు తన నలుగురు సోదరులతో కలసి వివిధ ఏజ్ గ్రూపులలో ఆంధ్రకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు.

జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకూ నిలకడగా రాణిస్తూ వచ్చిన వేణు… సచిన్ టెండుల్కర్ నాయకత్వంలోని భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు.

2005లో వన్డే క్యాప్…

వేణుగోపాల రావు 2005 సీజన్ లో భారత వన్డే జట్టులో చోటు సంపాదించాడు. 2006లో తన చివరి వన్డే ఆడిన వేణు ..తన కెరియర్ లో అత్యధికంగా 61 పరుగుల స్కోరు సాధించాడు. సచిన్ నాయకత్వంలో పాకిస్థాన్ తో వన్డే మ్యాచ్ ఆడటం తన క్రికెట్ కెరియర్ లో హైలైట్ గా నిలిచిపోతుందని వేణు చెబుతున్నాడు.

121 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 17 సెంచరీలు..

ఆంధ్ర కెప్టెన్ గా, గుజరాత్ రంజీ జట్టులో సభ్యుడిగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వేణు తన కెరియర్ లో 121 మ్యాచ్ లు ఆడి 17 సెంచరీలతో సహా.. మొత్తం 7వేల 81 పరుగులు సాధించాడు.

ఐపీఎల్ విజేత జట్టులో సభ్యుడిగా…

ఐపీఎల్ లో 2008- 2014 సీజన్ల మధ్యకాలంలో డెక్కన్ చార్జర్స్, ఢిల్లీడేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల తరపున మొత్తం 65 మ్యాచ్ లు ఆడిన రికార్డు వేణు గోపాలరావుకు ఉంది.

ఐపీఎల్ విజేతగా నిలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడిగా ఉండటం, భారత్ కు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 600 మందిలో తాను ఒకడిని కావడం.. గర్వకారణమని వేణుగోపాలరావు చెబుతున్నాడు.

తెలుగులో క్రికెట్ వ్యాఖ్యాతగా…

క్రికెట్ ఆటగాడిగా రిటైరైనా…క్రికెట్ తో తన అనుబంధం కొనసాగించాలని 37 ఏళ్ల వేణుగోపాలరావు నిర్ణయించాడు. తెలుగు భాషలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ..క్రికెటర్ల కోటాలో వేణుకు వ్యాఖ్యాతగా అవకాశం కల్పించింది.

ఐపీఎల్ తో పాటు…ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు తెలుగు వ్యాఖ్యాతగా వేణుగోపాలరావు వ్యవహరించాడు. హైదరాబాద్ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజుతో కలసి క్రికెట్ వ్యాఖ్యాతగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News