రామ్ కు బోనస్ ప్రకటించిన పూరి

ఇస్మార్ట్ శంకర్ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. రెట్టింపు లాభాలు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే ఓవర్ ఫ్లోస్ మొదలయ్యాయి. అవన్నీ నిర్మాతలకే దక్కుతాయి. అంటే చార్మి, పూరిలదే ఆ డబ్బంతా. కానీ ఇక్కడే పూరి జగన్నాధ్ మరోలా ఆలోచించాడు. తనకు ఇంత హిట్ ఇచ్చిన రామ్ ను గుర్తించాడు. అతడికి మరింత మొత్తం అందజేయబోతున్నాడు. కేవలం రామ్ ఎనర్జిటిక్ యాక్షన్ వల్లే ఇస్మార్ట్ శంకర్ ఇంత పెద్ద హిట్ అయిందంటూ తన ప్రచార సభల్లో చెబుతూ […]

Advertisement
Update:2019-07-31 11:38 IST

ఇస్మార్ట్ శంకర్ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. రెట్టింపు లాభాలు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే ఓవర్ ఫ్లోస్ మొదలయ్యాయి. అవన్నీ నిర్మాతలకే దక్కుతాయి. అంటే చార్మి, పూరిలదే ఆ డబ్బంతా. కానీ ఇక్కడే పూరి జగన్నాధ్ మరోలా ఆలోచించాడు. తనకు ఇంత హిట్ ఇచ్చిన రామ్ ను గుర్తించాడు. అతడికి మరింత మొత్తం అందజేయబోతున్నాడు.

కేవలం రామ్ ఎనర్జిటిక్ యాక్షన్ వల్లే ఇస్మార్ట్ శంకర్ ఇంత పెద్ద హిట్ అయిందంటూ తన ప్రచార సభల్లో చెబుతూ వస్తున్నాడు పూరి. రామ్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు. అలా పొగడ్డంతో పాటు ఇప్పుడు అదనంగా వస్తున్న లాభాల నుంచి కొంత మొత్తాన్ని రామ్ కు ఇవ్వడానికి నిర్ణయించాడు.

ఇస్మార్ట్ రిలీజ్ కు ముందే విదేశాలకు వెళ్లిపోయాడు రామ్. రీసెంట్ గా తిరిగి హైదరాబాద్ వచ్చాడు. సినిమా సక్సెస్ అయిన తర్వాత రామ్ తో ఎలాంటి ఈవెంట్ ప్లాన్ చేయలేదు. సో.. ఓ భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు పూరి జగన్నాధ్. అంతకంటే ముందు కొంత మొత్తాన్ని రామ్ కు అందించబోతున్నాడు.

డబ్బుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు పూరి. హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా ఒకేలా ఉంటాడు. ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి అతడు మారిపోలేదు. లాభాల్లో వాటాను రామ్ కు కూడా ఇవ్వాలని నిర్ణయించడంతో అతడి మైండ్ సెట్ ఏంటో అర్థమౌతుంది. అందుకేనేమో హీరోలందరికీ పూరి అంటే అంతిష్టం.

Tags:    
Advertisement

Similar News