భారతజట్టులో ముఠాలు లేవు

రోహిత్ తో విభేదాలు లేనేలేవు తేల్చి చెప్పిన విరాట్ కొహ్లీ ప్రపంచ కప్ సెమీస్ ఓటమితో భారత్ రెండుగా చీలిపోయిందని, ముఠా తగాదాలు బహిర్గతమయ్యాయంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ కొట్టిపడేశాడు. కరీబియన్ టూర్ కు బయలుదేరటానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో విరాట్ పాల్గొని పలు అంశాల గురించి చర్చించాడు. జట్టులో చీలిక నిజం కాదు.. భారతజట్టు రెండుగా చీలిపోయిందని..కొహ్లీ, రోహిత్ శర్మ ముఠాలుగా విడిపోయిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం […]

Advertisement
Update:2019-07-30 06:21 IST
  • రోహిత్ తో విభేదాలు లేనేలేవు
  • తేల్చి చెప్పిన విరాట్ కొహ్లీ

ప్రపంచ కప్ సెమీస్ ఓటమితో భారత్ రెండుగా చీలిపోయిందని, ముఠా తగాదాలు బహిర్గతమయ్యాయంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ కొట్టిపడేశాడు.

కరీబియన్ టూర్ కు బయలుదేరటానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో విరాట్ పాల్గొని పలు అంశాల గురించి చర్చించాడు.

జట్టులో చీలిక నిజం కాదు..

భారతజట్టు రెండుగా చీలిపోయిందని..కొహ్లీ, రోహిత్ శర్మ ముఠాలుగా విడిపోయిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని…రోహిత్ శర్మతో తన సంబంధాలు ఎప్పటిలానే ఉన్నాయని తెలిపాడు.

జట్టులో అంతర్గత కుమ్ములాటలు ఉంటే తాము ప్రపంచకప్ లీగ్ టేబుల్ టాపర్ గా ఎలా నిలువగలమని కొహ్లీ ప్రశ్నించాడు.

రవిశాస్త్రి వైపే కొహ్లీ చూపు…

భారత చీఫ్ కోచ్ గా రవిశాస్త్రినే కొనసాగిస్తే భారత క్రికెట్ కు మేలు జరుగుతుందని కొహ్లీ తన మనసులో మాట బయటపెట్టాడు. రవి భాయి నేతృత్వంలో తాము అత్యుత్తమంగా రాణించగలిగామని, ఆశించిన ఫలితాలు సాధించగలిగామని తెలిపాడు. అయితే చీఫ్ కోచ్ ఎవరన్నది తేల్చాల్చింది క్రికెట్ సలహామండలి మాత్రమేనని కొహ్లీ అన్నాడు.

రోహిత్ శర్మతో విభేదాలు లేవు…

వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని… తనకు ఎవరైనా నచ్చకపోతే ఆ భావం తన మొకంలోనే కనిపిస్తుందని విరాట్ కొహ్లీ వివరణ ఇచ్చాడు.

భారత చీఫ్ కోచ్ రవి శాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లతో పాటు…సహాయక సిబ్బందికి సైతం బీసీసీఐ 45 రోజులపాటు కాంట్రాక్టు కాలాన్ని పొడిగించింది. వెస్టిండీస్ తో ఆగస్టు 2 నుంచి జరిగే తీన్మార్ టీ-20, వన్డే సిరీస్ లతో పాటు…రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగిసే వరకూ మాత్రమే రవిశాస్త్రి అండ్ కో సేవలు అందించనున్నారు.

Tags:    
Advertisement

Similar News