దేశంలో వృద్ధి క్షీణిస్తోంది... ప్రభుత్వ తీరు సరిగా లేదు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో వృద్ధి క్షీణిస్తున్నా… పెట్టుబడులు తగ్గిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పెట్టుబడులకు, డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అందుకు ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రభుత్వం అంగీకరించినా, అంగీకరించకపోయినా… అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు గణాంకాలను పరిశీలిస్తే గత మూడునాలుగేళ్లుగా దేశంలో వృద్ధి క్షీణిస్తోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం మాత్రం అంతా బాగుందని […]

Advertisement
Update:2019-07-30 02:04 IST

కేంద్ర ప్రభుత్వ విధానాలపై బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో వృద్ధి క్షీణిస్తున్నా… పెట్టుబడులు తగ్గిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పెట్టుబడులకు, డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అందుకు ఎలాంటి చర్యలు లేవన్నారు.

ప్రభుత్వం అంగీకరించినా, అంగీకరించకపోయినా… అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు గణాంకాలను పరిశీలిస్తే గత మూడునాలుగేళ్లుగా దేశంలో వృద్ధి క్షీణిస్తోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం మాత్రం అంతా బాగుందని చెప్పుకుంటోందని విమర్శించారు. ఆటో మొబైల్‌ రంగం తీవ్ర సమస్యల్లో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిస్థితి ఇలా ఉంటే దేశంలో మరింత వృద్ధి ఎలా సాధ్యమవుతుందని రాహుల్ బజాజ్ ప్రశ్నించారు. ఇటీవల దేశంలో కార్లు, బైకుల అమ్మకాలు భారీగా పడిపోయాయి. సాధారణంగా డీలర్ల వద్ద నెల రోజులకు సరిపడ వాహన నిల్వలు ఉంటాయి. కానీ అమ్మకాలు పడిపోవడంతో డీలర్ల వద్ద 65రోజుల స్థాయికి నిల్వలు చేరిపోయాయి. ఈ నేపథ్యంలో రాహుల్ బజాజ్ కేంద్ర ప్రభుత్వంపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

Tags:    
Advertisement

Similar News