వేగంగా జగన్‌.... తాపీగా అధికారులు

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తయ్యింది. ఈ రెండు నెలల్లో ఎన్నో పరిపాలనా సంస్కరణలు చేసి త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొని పాలనను పరుగులు పెట్టించారు. తనదైన ముద్రను వేశారు. అయితే వైఎస్ జగన్ దూకుడైన వ్యవహారశైలిని, ప్రజలకు మేలు చేసేయాలన్న ధోరణిని, ఆ వేగాన్ని ఏపీ ఐఏఎస్ అధికారులు అలవర్చుకోవడం లేదన్న టాక్ సెక్రెటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన హామీల అమలుకు కష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. […]

Advertisement
Update:2019-07-29 08:30 IST

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తయ్యింది. ఈ రెండు నెలల్లో ఎన్నో పరిపాలనా సంస్కరణలు చేసి త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొని పాలనను పరుగులు పెట్టించారు. తనదైన ముద్రను వేశారు.

అయితే వైఎస్ జగన్ దూకుడైన వ్యవహారశైలిని, ప్రజలకు మేలు చేసేయాలన్న ధోరణిని, ఆ వేగాన్ని ఏపీ ఐఏఎస్ అధికారులు అలవర్చుకోవడం లేదన్న టాక్ సెక్రెటేరియట్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

జగన్ అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన హామీల అమలుకు కష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన అధికారులు రూల్ బుక్, నిబంధనల పేరిట ముఖ్యమంత్రి ఆలోచనలు అమలు చేయకుండా కొర్రీలు వేస్తూ, రూల్ బుక్ కు వ్యతిరేకమంటూ జాప్యం చేస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి. జగన్ దీనిపై సీరియస్ అవుతున్నా కానీ అధికారుల తీరు మారకపోవడం ఇప్పుడు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్ సీఎంగా గద్దెనెక్కగానే తాను అధికారులతో స్నేహపూర్వకంగా ఉంటానని హామీ ఇచ్చాడు. తనకు మీరందరూ సలహాలు, సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని కోరాడు. చంద్రబాబు హయాంలో నిద్రపోవడానికి కూడా సమయం ఇచ్చేవాడు కాదట.. రాత్రిపగలు సమీక్షల పేరుతో విసిగించిన బాబు పోయి ఇప్పుడు జగన్ రావడంతో అధికారులంతా ఉదాసీనతకు అలవాటు పడ్డారు.

జగన్ ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా, లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

అందుకే జగన్ తన పథకాలు, నవరత్నాల అమలుకు తాపత్రాయ పడుతున్నా అధికారులు ఆర్థిక వనరులు లేవంటూ.. అమలు సాధ్యం కాదంటూ కొర్రీలు వేయడం హాట్ టాపిక్ గా మారింది.

అధికారుల వ్యవహారశైలి జగన్ కు కోపం తెప్పించిందని టాక్. జగన్ గట్టిగా అమలు చేయాలని కోరడంతో జగన్ మొండి పట్టుదల చూసి ఇప్పుడు ఐఏఎస్ లంతా అలెర్ట్ అయినట్టు టాక్. జగన్ పట్టు వదలరని.. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయండని.. కష్టమైతే.. విఫలమైతే అది జగన్‌ పైనే నింద వస్తుందని ఐఏఎస్ లకు సీనియర్ అధికారి స్పష్టం చేసినట్టు టాక్.

Tags:    
Advertisement

Similar News