బీజేపీకి స్పీక‌ర్ షాక్... య‌డ్యూర‌ప్ప సీఎం అయ్యే చాన్స్ ఉందా?

క‌ర్నాట‌క రాజ‌కీయాలు మ‌రో ట‌ర్న్ తీసుకున్నాయి. జేడీఎస్‌, కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వం కూలింది. ఇక తాము గ‌ద్ద‌నెక్క‌డ‌మే లేటు…. య‌డ్యూర‌ప్ప సీఎం అవుతార‌ని బీజేపీ నేతలు అనుకున్నారు. కానీ బీజేపీ పెద్ద‌ల‌కు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ నిర్ణ‌యాలు షాక్ ఇస్తున్నాయి. య‌డ్యూరప్ప ఇప్ప‌టికే సీఎంగా ప్రమాణం చేయాలి. కానీ స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ సంగ‌తి తెలిసిన బీజేపీ పెద్ద‌లు సీఎంగా యెడ్డీ ప్ర‌మాణానికి వెంట‌నే క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేద‌ట‌. స్పీక‌ర్ భ‌యంతోనే ప్ర‌భుత్వ ఏర్పాటుకు కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని […]

Advertisement
Update:2019-07-26 01:47 IST

క‌ర్నాట‌క రాజ‌కీయాలు మ‌రో ట‌ర్న్ తీసుకున్నాయి. జేడీఎస్‌, కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వం కూలింది. ఇక తాము గ‌ద్ద‌నెక్క‌డ‌మే లేటు…. య‌డ్యూర‌ప్ప సీఎం అవుతార‌ని బీజేపీ నేతలు అనుకున్నారు. కానీ బీజేపీ పెద్ద‌ల‌కు స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ నిర్ణ‌యాలు షాక్ ఇస్తున్నాయి.

య‌డ్యూరప్ప ఇప్ప‌టికే సీఎంగా ప్రమాణం చేయాలి. కానీ స్పీక‌ర్ ర‌మేష్ కుమార్ సంగ‌తి తెలిసిన బీజేపీ పెద్ద‌లు సీఎంగా యెడ్డీ ప్ర‌మాణానికి వెంట‌నే క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేద‌ట‌. స్పీక‌ర్ భ‌యంతోనే ప్ర‌భుత్వ ఏర్పాటుకు కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని భావించార‌ట‌. అన్న‌ట్లుగానే స్పీక‌ర్ షాకింగ్ నిర్ణ‌యాలు తీసుకున్నారు.

సంకీర్ణ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్‌ అన‌ర్హ‌త వేటు వేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్‌ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. మిగిలిన ఎమ్మెల్యేలపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తే మిగిలిన ఎమ్మెల్యేల‌పై కూడా ద‌శ‌ల‌వారీగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. దీంతో ఆచి తూచి అడుగులు వేయాల‌ని బీజేపీ ఆలోచిస్తోంది.

మ‌రోవైపు య‌డ్యూరప్పను సీఎంగా చేయాలా? ప‌్ర‌త్యామ్నాయం వైపు ఆలోచించాలా? అనే విష‌యాల‌ను కూడా ప‌రిశీలిస్తుంద‌ట‌. మొత్తానికి క‌న్న‌డ రాజ‌కీయంలో మ‌రిన్ని ట్విస్ట్‌లు ఉండ‌బోతున్నాయ‌ని మాత్రం తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News