ఇది కూడా రీమేక్ సినిమానే

ఒక్క సినిమా అనుభవంతోనే రాహుల్ రవీంద్రన్ కు నాగార్జున అవకాశం ఇవ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదేం చోద్యం అంటూ గుసగుసలాడుకున్నారు. నాగ్ ఇమేజ్ ను రాహుల్ హ్యాండిల్ చేయగలడా అని అనుమానం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లకు రాహుల్ కు నాగ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చాడనే విషయం బయటకొచ్చింది. అవును… మన్మథుడు-2 అనేది ఓ రీమేక్ సినిమా. అందుకే నాగార్జున పెద్దగా ఆలోచించకుండా రాహుల్ కు అవకాశం ఇచ్చాడు. ఓ ఫ్రెంచ్ సినిమాను రాహుల్ కు ఇచ్చి తెలుగు […]

Advertisement
Update:2019-07-26 10:58 IST

ఒక్క సినిమా అనుభవంతోనే రాహుల్ రవీంద్రన్ కు నాగార్జున అవకాశం ఇవ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదేం చోద్యం అంటూ గుసగుసలాడుకున్నారు. నాగ్ ఇమేజ్ ను రాహుల్ హ్యాండిల్ చేయగలడా అని అనుమానం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లకు రాహుల్ కు నాగ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చాడనే విషయం బయటకొచ్చింది.

అవును… మన్మథుడు-2 అనేది ఓ రీమేక్ సినిమా. అందుకే నాగార్జున పెద్దగా ఆలోచించకుండా రాహుల్ కు అవకాశం ఇచ్చాడు. ఓ ఫ్రెంచ్ సినిమాను రాహుల్ కు ఇచ్చి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయమన్నాడు నాగ్. అలా చిలసౌ తర్వాత నాగ్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు రాహుల్

తను ఓ రీమేక్ చేస్తున్నాననే విషయాన్ని నాగార్జున స్వయంగా బయటపెట్టాడు.

మన్మథుడు-2 ట్రయిలర్ లాంఛ్ సందర్భంగా మాట్లాడిన నాగార్జున.. ఫ్రెంచ్ లో హిట్ అయిన ఓ సినిమా హక్కుల్ని కొని మరీ మన్మథుడు-2ను తీశామని చెప్పుకొచ్చాడు. అలా నాగ్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. అయితే సినిమా రీమేక్ అయినప్పటికీ తన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుందంటున్నాడు రాహుల్. తెలుగు ప్రజలు, నాగ్ ఫ్యాన్స్ టేస్ట్ కు తగ్గట్టు మూవీలో చాలా మార్పులు చేశామని, ఇంకా చెప్పాలంటే కేవలం మూలకథను మాత్రమే తీసుకున్నామని చెబుతున్నాడు. వచ్చేనెల 9న థియేటర్లలోకి రానుంది మన్మథుడు-2.

Tags:    
Advertisement

Similar News