ఇదే పని పక్క రాష్ట్రాలు చేస్తే మనవాళ్లు ఏం కావాలి?
ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేయడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన చట్టాన్నే రేపు ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే పరిస్థితి ఏమిటి అని […]
ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేయడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు.
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన చట్టాన్నే రేపు ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా చట్టం తెస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీ లాంటి చోట్ల మన వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయని నాని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు… అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని కేశినేని నాని విమర్శించారు.
జగన్ రెడ్డి గారు @ysjagan పిచ్చి వాడి చేతిలో రాయి లాగా వుంది మీ చేతిలో అధికారం.
మీరు చేసిన చట్టమే రేపు ఇతర రాష్ట్రాలు చేస్తే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె ఢిల్లీ లాంటి చోట్లలో మన వారికి ఉద్యోగాలు వస్తాయా?
అమ్మ పెట్టలేదు అడుక్కు తిననివదు అన్నట్లుంది పరిస్థితి pic.twitter.com/yrF2oP2jJX— Kesineni Nani (@kesineni_nani) July 24, 2019