జూనియర్ ఎన్టీఆర్‌ నియామకం సాధ్యమా?

ఏపీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ నియమితులు కాబోతున్నారంటూ ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవుతారని భావించలేం. గతంలో హరికృష్ణ వైసీపీలో చేరుతున్నారంటూ కూడా కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు తిరిగి జూనియర్‌ ఎన్టీఆర్‌ను జగన్ ఏరికోరి ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబోతున్నారన్న ప్రచారం వెనుక కూడా రాజకీయ ఉద్దేశమే కనిపిస్తోంది. టీడీపీని భవిష్యత్తులో నడిపించే నాయకులు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్‌ పేరు […]

Advertisement
Update:2019-07-24 15:26 IST

ఏపీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ నియమితులు కాబోతున్నారంటూ ఇటీవల బాగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవుతారని భావించలేం.

గతంలో హరికృష్ణ వైసీపీలో చేరుతున్నారంటూ కూడా కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు తిరిగి జూనియర్‌ ఎన్టీఆర్‌ను జగన్ ఏరికోరి ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబోతున్నారన్న ప్రచారం వెనుక కూడా రాజకీయ ఉద్దేశమే కనిపిస్తోంది.

టీడీపీని భవిష్యత్తులో నడిపించే నాయకులు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్‌ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. పరోక్షంగా నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ పోటీ అవుతున్నారన్న భావన ఉంది.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌కు వైసీపీతో సంబంధాలున్నాయి, ఆయన జగన్‌ పక్షం అని ప్రచారం చేయడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో జూనియర్ ఎన్టీఆర్‌పై వ్యతిరేకత పెంచే వ్యూహం ఉన్నట్టు అనిపిస్తోంది.

నారా లోకేష్‌కు నాయకత్వం విషయంలో పోటీ లేకుండా చేసేందుకే ఈ ప్రచారం జరుగుతోందన్న అనుమానం కూడా కలుగుతోంది.

దీనికి తోడు వీలైనంత వరకు దుబారా తగ్గించుకునే పాలన చేస్తానని జగన్‌ చెబుతున్నారు. అలాంటప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చి సినిమావాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా జగన్‌ పెట్టుకుంటారంటే అనుమానమే.

ఒకవేళ ఉచితంగా జూనియర్ ఎన్టీఆర్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని చెప్పడానికి లేదు. అలా చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్‌ కు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రచారం అంతా జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ శ్రేణుల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకే కొందరు ప్రచారం చేస్తూ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News