ప్రపంచకప్ తోనే ముగిసిన ధోనీ వన్డే కెరియర్

చీఫ్ సెలెక్టర్ కు తేల్చి చెప్పిన జార్ఖండ్ డైనమైట్  ధోనీ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ ఇక లాంఛనమే భారత వన్డే క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ..వన్డే రిటైర్మెంట్ లాంఛనంగా మారిపోయింది. వన్డే క్రికెట్ కు భారతజట్లను ఎంపిక చేసే సమయంలో తన పేరును పరిగణనలోకి తీసుకోనే వద్దని.. తాను రేస్ లో లేనేలేనని.. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు ధోనీ తేల్చిచెప్పాడు. ఈ విషయాన్ని ఎమ్మెస్కేనే […]

Advertisement
Update:2019-07-22 17:36 IST
  • చీఫ్ సెలెక్టర్ కు తేల్చి చెప్పిన జార్ఖండ్ డైనమైట్
  • ధోనీ వన్డే క్రికెట్ రిటైర్మెంట్ ఇక లాంఛనమే

భారత వన్డే క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ..వన్డే రిటైర్మెంట్ లాంఛనంగా మారిపోయింది.

వన్డే క్రికెట్ కు భారతజట్లను ఎంపిక చేసే సమయంలో తన పేరును పరిగణనలోకి తీసుకోనే వద్దని.. తాను రేస్ లో లేనేలేనని.. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు ధోనీ తేల్చిచెప్పాడు. ఈ విషయాన్ని ఎమ్మెస్కేనే స్వయంగా ప్రకటించాడు.

రిటైర్మెంట్ ధోనీ ఇష్టం…

వన్డే క్రికెట్ రేస్ లో తానులేనని చెప్పడంతో…తమకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని…యువఆటగాళ్ల ఎంపికకు…ప్రధానంగా యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కు ఇక మూడు ఫార్మాట్లలోనూ తగినన్ని అవకాశాలు ఇస్తామని చీఫ్ సెలెక్టర్ తెలిపాడు.

వన్డే క్రికెట్ నుంచి ధోనీ ఎప్పుడు రిటైర్ కావాలనుకొంటే అప్పుడే రిటైర్ కావచ్చునని..ఎప్పుడు ..ఎలా రిటైర్ కావాలో ధోనీ ఇష్టమని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు.

ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ తో 350 మ్యాచ్ లు పూర్తి చేయడంతో పాటు 10వేల 700కు పైగా పరుగులు సాధించిన ధోనీ…తన కెరియర్ లో ఆఖరి వన్డే మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ముగిసిన సెమీస్ మ్యాచ్ లో ఫైటింగ్ హాఫ్ సెంచరీతో ముగించినట్లయ్యింది.

రాయుడు పట్ల వివక్షలేదు…

ప్రపంచకప్ లో అంబటి రాయుడుకు చోటు లేకుండా పోవటంలో తమ ప్రమేయం లేనేలేదని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.

క్రికెటర్ల పట్ల ఎలాంటి వివక్ష చూపబోమని.. జట్టు అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగానే జట్టు కూర్పు ఉంటుందని ఎమ్మెస్కే వివరించాడు.

ప్రపంచకప్ కు స్టాండ్ బైగా ఉన్న రాయుడిని కాదని…రిషభ్ పంత్, మయాంక్ అగర్వాల్ లను ఎంపిక చేయడం చీప్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీ అభిష్టం మేరకే జరిగిందని తెలిపాడు.

లెఫ్ట్ హ్యాండర్ శిఖర్ ధావన్ గాయపడడంతో అతని స్థానంలో మరో ఎడమచేతి వాటం ఆటగాడు రిషభ్ పంత్ ను ఎంపిక చేశామని.. అలాగే ఓపెనర్ రాహుల్ గాయం కారణంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను స్టాండ్ బైగా పంపామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే వివరణ ఇచ్చాడు.

Tags:    
Advertisement

Similar News