రిటైర్మెంట్ ఊహాగానాలకు ధోనీ తెర
కరీబియన్ టూర్ కు దూరమంటూ మాస్టర్ స్ట్ర్రోక్ 2020 టీ-20 ప్రపంచకప్ వైపు ధోనీ చూపు వన్డే ప్రపంచకప్ తో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగలడనుకొన్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ… క్రికెట్ విరమణ నిర్ణయానికి విరామం ప్రకటించాడు. కరీబియన్ టూర్ కు తాను అందుబాటులో ఉండబోనని…ఎంపిక సంఘానికి సమాచారం అందించడం ద్వారా తన రిటైర్మెంట్ పై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరదించాడు. వచ్చే రెండుమాసాలపాటు ఓ సైనికుడుగా భారత సైనిక దళాలకు సేవ చేయాలని నిర్ణయించినట్లు […]
- కరీబియన్ టూర్ కు దూరమంటూ మాస్టర్ స్ట్ర్రోక్
- 2020 టీ-20 ప్రపంచకప్ వైపు ధోనీ చూపు
వన్డే ప్రపంచకప్ తో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగలడనుకొన్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ… క్రికెట్ విరమణ నిర్ణయానికి విరామం ప్రకటించాడు.
కరీబియన్ టూర్ కు తాను అందుబాటులో ఉండబోనని…ఎంపిక సంఘానికి సమాచారం అందించడం ద్వారా తన రిటైర్మెంట్ పై జోరుగా సాగుతున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరదించాడు.
వచ్చే రెండుమాసాలపాటు ఓ సైనికుడుగా భారత సైనిక దళాలకు సేవ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించాడు. ఇండియన్ ఆర్మీ ప్రాదేశిక దళానికి చెందిన పారాచ్యూట్ రెజిమెంట్ లో లెఫ్ట్ నెంట్ కర్నల్ గా గౌరవహోదా పొందిన 38 ఏళ్ల ధోనీ..తన వ్యూహాత్మక క్రికెట్ విరామాన్ని దేశసేవకు వినియోగించాలని నిర్ణయించడం ద్వారా తనలోని దేశభక్తిని చాటుకొన్నాడు.
ధోనీ విండీస్ తో జరిగే తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లకు అందుబాటులో లేకపోడంతో…యువవికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఎంపికకు మార్గం సుగమమైనట్లయ్యింది.
ఆస్ట్ర్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ వరకూ ధోనీ తన కెరియర్ ను కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు… మహీ చిన్ననాటి కోచ్ ప్రకటించడం విశేషం.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగనున్న ధోనీ…భారత టీ-20 జట్టులోనూ తన స్థానం నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
మొత్తం మీద..మహేంద్ర సింగ్ ధోనీ..14 సంవత్సరాల క్రికెట్ కెరియర్ ముగింపు సశేషంగానే మిగిలిపోయింది.