"ఆమె"కు లైన్ క్లియర్ అయింది

ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించింది. ట్రయిలర్ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో “ఆమె” సినిమా చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎగబడ్డారు. కానీ అనూహ్యంగా నిన్న ఈ సినిమా షోలు రద్దయ్యాయి. టిక్కెట్లు బుక్ చేసుకున్నవాళ్లంతా నిరాశగా వెనుతిరిగారు. నిర్మాతతో ఫైనాన్షియర్లకు ఉన్న సమస్యల వల్లనే సినిమా రిలీజ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా ఆగిపోయిన వెంటనే మేకర్స్ ఎలర్ట్ అయ్యారు. ఫైనాన్షియర్లతో సమస్యల్ని కొలిక్కి తీసుకొచ్చారు. మధ్యాహ్నానికే మేటర్ సెటిల్ అయింది. తమిళనాట […]

Advertisement
Update:2019-07-21 01:45 IST

ఈ సినిమాలో అమలాపాల్ నగ్నంగా నటించింది. ట్రయిలర్ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో “ఆమె” సినిమా చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎగబడ్డారు. కానీ అనూహ్యంగా నిన్న ఈ సినిమా షోలు రద్దయ్యాయి. టిక్కెట్లు బుక్ చేసుకున్నవాళ్లంతా నిరాశగా వెనుతిరిగారు.

నిర్మాతతో ఫైనాన్షియర్లకు ఉన్న సమస్యల వల్లనే సినిమా రిలీజ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా ఆగిపోయిన వెంటనే మేకర్స్ ఎలర్ట్ అయ్యారు. ఫైనాన్షియర్లతో సమస్యల్ని కొలిక్కి తీసుకొచ్చారు. మధ్యాహ్నానికే మేటర్ సెటిల్ అయింది. తమిళనాట మ్యాట్నీ షోలు పడ్డాయి. కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం షోలు పడేసరికి సాయంత్రం అయింది. అలా పూర్తిగా ఓపెనింగ్స్ కోల్పోయింది ఆమె సినిమా.

ఈ సినిమాపై ఏర్పడిన బజ్ మొత్తం ఈ చిన్న వివాదం కారణంగా పోయింది. చివరికి తెలుగులో ఈ సినిమా పరిస్థితి ఎలా తయారైందంటే.. రెగ్యులర్ గా సినిమాపై రివ్యూలు ఇచ్చే సమీక్షకులు కూడా “ఆమె”ను లైట్ తీసుకున్నారు. ఈ వివాదాన్ని పక్కనపెడితే.. కోలీవుడ్ లో ఆమె సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అమలాపాల్ బోల్డ్ యాక్టింగ్ ఈ సినిమాను ఆదుకోలేకపోయిందని అక్కడి రివ్యూలు తేల్చిచెప్పేశాయి. తెలుగులో ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది సోమవారం నాటికి తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News