షీలా దీక్షిత్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ చనిపోయారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. తిరుగులేని నేతగా ఆమె నిలబడ్డారు. అనంతరం కేరళ గవర్నర్‌గా కూడా ఆమె పనిచేశారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా ఈమెకు పేరుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు […]

Advertisement
Update:2019-07-20 11:13 IST

కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ చనిపోయారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. తిరుగులేని నేతగా ఆమె నిలబడ్డారు.

అనంతరం కేరళ గవర్నర్‌గా కూడా ఆమె పనిచేశారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా ఈమెకు పేరుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. ఆమె వయసు 81 ఏళ్లు. ఈమె స్వస్థలం పంజాబ్.

Tags:    
Advertisement

Similar News