ధోనీ భవితవ్యాన్ని తేల్చనున్న బీసీసీఐ

ముంబైలో రేపే ఎంపిక సంఘం సమావేశం విండీస్ టూర్ కు భారతజట్టు ఎంపిక టెస్ట్ సిరీస్ కే పరిమితం కానున్న విరాట్ కొహ్లీ కరీబియన్ ద్వీపాల పర్యటన కోసం భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం…. ముంబైలో శుక్రవారం జరిగే సమావేశంలో ఎంపికచేయనుంది. ప్రపంచకప్ సెమీస్ లోనే భారతజట్టు పరాజయం నేపథ్యంలో… ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఆగస్టు 3 నుంచి కరీబియన్ ద్వీపాలలో పర్యటించే భారతజట్టు… విండీస్ జట్టుతో మూడుమ్యాచ్ ల […]

Advertisement
Update:2019-07-18 13:00 IST
  • ముంబైలో రేపే ఎంపిక సంఘం సమావేశం
  • విండీస్ టూర్ కు భారతజట్టు ఎంపిక
  • టెస్ట్ సిరీస్ కే పరిమితం కానున్న విరాట్ కొహ్లీ

కరీబియన్ ద్వీపాల పర్యటన కోసం భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం…. ముంబైలో శుక్రవారం జరిగే సమావేశంలో ఎంపికచేయనుంది.

ప్రపంచకప్ సెమీస్ లోనే భారతజట్టు పరాజయం నేపథ్యంలో… ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశం కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.

ఆగస్టు 3 నుంచి కరీబియన్ ద్వీపాలలో పర్యటించే భారతజట్టు… విండీస్ జట్టుతో మూడుమ్యాచ్ ల టీ-20, వన్డే సిరీస్ లతో పాటు… రెండుటెస్టుల ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ టోర్నీలో సైతం పాల్గోనుంది.

ఈ మూడు ఫార్మాట్లలో పాల్గొనే జట్లను ఎంపిక చేయటం కోసమే సెలెక్టర్లు సమావేశం కాబోతున్నారు.

ధోనీ ఎంపికపై సస్పెన్స్…

2019 ప్రపంచకప్ తో రిటైర్మెంట్ ప్రకటించగలడనుకొన్న మహేంద్రసింగ్ ధోనీ…. కిమ్మనకుండా ఉండటం సెలెక్షన్ కమిటీ సహనానికి పరీక్షగా మారింది.

రిటైర్మెంట్ పై ధోనీ తన మనసులోని మాట ఇప్పటికీ బయటపెట్టకపోడంతో…వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ స్థానం కోసం ధోనీ సైతం పోటీలో ఉన్నట్లుగానే భావిస్తున్నారు.

అయితే…విండీస్ లాంటి చిన్నజట్టుతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల కోసం ధోనీ లాంటి పెద్ద ఆటగాడిని ఎందుకు ఎంపిక చేయాలన్న అంశం పై క్రికెట్ వర్గాలలో ఇప్పటికే చర్చప్రారంభమయ్యింది.

ధోనీ స్థానంలో యువఆటగాడు రిషభ్ పంత్ వైపే సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపడం ఖాయంగా కనిపిస్తోంది.

వన్డే, టీ-20 కెప్టెన్ గా రోహిత్?

విండీస్ తో జరిగే తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టుకు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాదిగా విశ్రాంతి లేకుండా ఆడుతున్న విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇచ్చి…రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మాత్రమే ఆడించాలని ఎంపిక సంఘం భావిస్తోంది. అంటే టెస్ట్ చాంపియన్షిప్ లోని రెండుమ్యాచ్ లకు మాత్రమే…కొహ్లీ భారతజట్టు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది.

మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఖలీల్ అహ్మద్ లాంటి పలువురు యువక్రికెటర్లు సైతం భారతజట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.

వెటరన్ ధోనీ భారత వన్డే ,టీ-20 జట్లలో చోటు దక్కించుకోగలడా?…విరాట్ కొహ్లీ కేవలం టెస్ట్ సిరీస్ కే పరిమితమవుతాడా?..
అన్న ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే …మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News