ఏపీకి గవర్నర్‌గా విశ్వభూషణ్‌

ఏపీకి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ స్థానంలో ఏపీకి బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించింది. ఈమేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహన్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరిస్తారు. విశ్వభూషణ్‌ హరిచందన్‌ వయసు 85 ఏళ్లు. ఈయన స్వస్థలం ఒడిషా. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. భువనేశ్వర్‌ నుంచి మూడు […]

Advertisement
Update:2019-07-16 13:38 IST

ఏపీకి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఇప్పటి వరకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ స్థానంలో ఏపీకి బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్రం నియమించింది. ఈమేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహన్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరిస్తారు.

విశ్వభూషణ్‌ హరిచందన్‌ వయసు 85 ఏళ్లు. ఈయన స్వస్థలం ఒడిషా. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. భువనేశ్వర్‌ నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన సిలికా నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు.

1971లో జనసంఘ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1977లో బీజేపీలో చేరారు. న్యాయవాద విద్యను అభ్యసించిన విశ్వభూషణ్‌.. ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మారుబటాస్‌, రాణా ప్రతాప్‌, శేషజలక్‌, అస్తశిఖ వంటి పలు పుస్తకాలు రచించారు. ఒడిశా బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు విశ్వభూషణ్‌ హరిచందన్‌.

Tags:    
Advertisement

Similar News