టీఆర్ఎస్ కు షాక్.... బిగ్ షాట్ ను పట్టిన అమిత్ షా

ఉమ్మడి ఏపీలో డీ శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఉంటూ రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతగా పేరుపొందాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఈయన రాజకీయాలు చేసే తన కుమారుడు అరవింద్ ను నిజామాబాద్ లో గెలిపించుకున్నారని గుసగుసలు వినిపిస్తుంటాయి. నిజామాబాద్ లో కవిత ఓడిపోవడం వెనుక డీఎస్ ఉన్నాడని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ కు రాజ్యసభ సీటు ఇచ్చి మరీ కేసీఆర్ గౌరవించారు. కానీ ఆయన మాత్రం టీఆర్ఎస్ లో […]

Advertisement
Update:2019-07-12 06:20 IST

ఉమ్మడి ఏపీలో డీ శ్రీనివాస్ పీసీసీ చీఫ్ గా ఉంటూ రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతగా పేరుపొందాడు.

మొన్నటి ఎన్నికల్లో కూడా ఈయన రాజకీయాలు చేసే తన కుమారుడు అరవింద్ ను నిజామాబాద్ లో గెలిపించుకున్నారని గుసగుసలు వినిపిస్తుంటాయి. నిజామాబాద్ లో కవిత ఓడిపోవడం వెనుక డీఎస్ ఉన్నాడని టీఆర్ఎస్ అనుమానిస్తోంది.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ కు రాజ్యసభ సీటు ఇచ్చి మరీ కేసీఆర్ గౌరవించారు. కానీ ఆయన మాత్రం టీఆర్ఎస్ లో ఉంటూనే తన కుమారుడు అరవింద్ ను బీజేపీ ఎంపీగా గెలిపించుకున్నారని…. అనుచరులు, కార్యకర్తలను అరవింద్ గెలుపు కోసం వాడారని అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు ఫిర్యాదు కూడా చేశారు.

అయితే డీఎస్ ను సస్పెండ్ చేయకుండా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం పెట్టారు కేసీఆర్. సస్పెండ్ చేస్తే టీఆర్ఎస్ ఇచ్చిన రాజ్యసభ సీటును ఫ్రీగా వదిలేసినట్టు అవుతుందని…. ఆయన వేరే పార్టీ మారి కండువా ధరించినప్పుడు…. రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు పడేలా చేద్దామని కేసీఆర్ యోచించారు.

అయితే రాజకీయాల్లో ఆరితేరిన డీఎస్ అప్పట్లో సోనియాను కలిసినప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఇప్పుడు తాజాగా అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా బీజేపీ కండువా కప్పుకోలేదు.

ఇలా రాజ్యసభ పదవి పోకుండా డీఎస్ రాజకీయం చేయడం కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. టీఆర్ఎస్ లో ఉంటూనే బీజేపీకి పనిచేస్తుండడంతో ఇప్పుడు కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. రాజ్యసభ మొత్తం బీజేపీ కంట్రోల్లోనే ఉండడంతో డీఎస్ బీజేపీలో చేరినా టీఆర్ఎస్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.

Tags:    
Advertisement

Similar News